News June 14, 2024
పోలీసులు పద్ధతి మార్చుకోవాలి: అనిత
AP: పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ‘కొంతమంది పోలీసులు పద్ధతి మార్చుకోవాలి. లేదంటే మేమే మారుస్తాం. మాచర్లలో చంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్ చేస్తాం. TDP కార్యకర్తలు, నేతలు గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమ కేసులపై సమీక్ష జరుగుతుంది. నాకు కీలకమైన హోంశాఖ అప్పగించిన చంద్రబాబు, పవన్, లోకేశ్, NDA నేతలకు కృతజ్ఞతలు’ అని ఆమె వెల్లడించారు.
Similar News
News December 26, 2024
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమే బెస్ట్: మోహన్ లాల్
ప్రస్తుతం దేశంలో తెలుగు సినీ పరిశ్రమే అగ్రస్థానంలో ఉందని మలయాళ నటుడు మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. టాలెంట్‌ను టాలీవుడ్ ప్రోత్సహిస్తుంటుందని ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు. సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూ సరిహద్దుల్ని తెలుగు సినిమా చెరిపేస్తోందని ఆయన ప్రశంసించారు. అవకాశం దక్కితే <<14978053>>మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తానంటూ<<>> ఆయన ఇప్పటికే అభిలాషను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
News December 26, 2024
మళ్లీ రిలీజవుతున్న ‘గుంటూరు కారం’
మహేశ్ బాబు గత మూవీ ‘గుంటూరు కారం’ అంతంతమాత్రంగానే ఆడింది. సోషల్ మీడియాలో మాత్రం మూవీ గురించి మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఆ సినిమాను డిసెంబరు 31న పరిమిత స్క్రీన్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈసారి మాత్రం సీట్లన్నీ చకాచకా నిండిపోతుండటం విశేషం. ఈ ఆదరణ కొనసాగితే స్క్రీన్ల సంఖ్యను మరింత పెంచాలని మూవీ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం.
News December 26, 2024
YCPపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది: సజ్జల
AP: సమస్యలపై తక్షణమే స్పందిస్తుండటంతో వైసీపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని నేతలు భరోసా అందించాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టాలి. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి’ అని ఆయన నేతలకు సూచించారు.