News April 25, 2024
ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలి: బొండా ఉమ

AP: కొందరు పోలీసులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. ‘తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో నన్ను అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన CPపై EC తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలి. తాము ఈసీ పరిధిలో ఉన్నామని గుర్తించాలి. విజయవాడ సెంట్రల్‌లో ఏసీపీ, సీఐలు వెల్లంపల్లి కనుసన్నల్లో నడుస్తున్నారు. వీరిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతాం’ అని ఆయన వెల్లడించారు.
Similar News
News April 3, 2026
ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎస్.సరస్వతి’

వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎస్.సరస్వతి’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉండగా, త్వరలో మరిన్ని భాషలను యాడ్ చేయనున్నారు. మార్చి 6న రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, రావు రమేశ్, మురళీ శర్మ, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.
News April 3, 2026
ట్రంప్ మావా.. అసలు నీ బాధేంటి?

ఇరాన్‌తో యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీరు, <<19543167>>ప్రకటనలు<<>> గందరగోళానికి గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను నాశనం చేశామని, త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తామన్నారు. ఇవాళ ఆ దేశం డీల్ చేసుకోవాలని ఒత్తిడి చేశారు. నిజంగానే ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేస్తే మళ్లీ డీల్ కోసం అడుక్కోవడం ఎందుకని SMలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. <<19538873>>హార్ముజ్‌పైనా<<>> ఆయన పూటకో మాట <<19487591>>మాట్లాడటంపై<<>> విమర్శలొస్తున్నాయి.
News April 3, 2026
పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.458

పాకిస్థాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో <<19319137>>రెండో సారి<<>> పెట్రోల్, డీజిల్ ధరలను అక్కడి ప్రభుత్వం పెంచింది. 42.7% పెరుగుదలతో లీటర్ పెట్రోల్ ధర 458 పాకిస్థానీ రూపాయలకు చేరింది. డీజిల్ రేటు 55% పెరిగి 520 PKRకి ఎగసింది. ఇవాళ్టి నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పాయని, దీంతో ధరలు పెంచక తప్పలేదని పెట్రోలియం మంత్రి అలీ మాలిక్ అన్నారు.


