News May 11, 2024
పోలీస్ సైరన్.. రూ.2కోట్లు రోడ్డుపై పడేశారు!

AP: పోలీసులు వెంబడిస్తున్నారనే భయంతో అర్ధరాత్రి ఆగంతకులు రూ.2కోట్ల నగదును రహదారిపై పడేసి వెళ్లిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో చోటు చేసుకుంది. పోలీస్ సైరన్ వినిపించడంతో ఇళ్ల ముందు డబ్బు సంచులు పడేసి వెళ్లిపోయారు. కొంతసేపు ఆగి వచ్చి చూడగా అందులో రూ.40 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. అక్కడి ప్రజలను విచారించి లాభం లేక మిగతా డబ్బుతో వెనుదిరిగారట. ఈ డబ్బు హిందూపురానికి తరలిస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 7, 2026
WC ఫైనల్‌లో గెలిచేది ఇండియానే: ChatGpt

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 WC <<19308021>>ఫైనల్‌లో<<>> గెలుపెవరిదో ఏఐ ఏజెంట్లు ChatGpt & Gemini ప్రిడిక్ట్ చేశాయి. NZతో జరిగే ఈ మ్యాచులో సొంతగడ్డపై ఇండియా సత్తా చూపిస్తుందని, సూర్యకుమార్ ట్రోఫీ లిఫ్ట్ చేస్తారని పేర్కొన్నాయి. ‘స్పిన్నర్స్ & బ్యాటర్లకు పిచ్ అనుకూలంగా ఉంది. ప్రేక్షకుల వల్ల ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది. NZ 170 స్కోర్ చేయగలదు. IND ఈజీగా ఛేజ్ చేస్తుంది’ అని తెలిపాయి.
News March 7, 2026
నటుడు మురళీధర్ భార్య కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీధర్ గౌడ్ భార్య శశికళ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన మురళీధర్ రిటైర్మెంట్ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు చేశారు. రంగ స్థలం, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, బలగం, మ్యాడ్, మేం ఫేమస్ తదితర చిత్రాలతో గుర్తింపు పొందారు.
News March 7, 2026
వామ్మో ఎండలు.. 40 డిగ్రీలు దాటేసిన టెంపరేచర్!

TG: మార్చి తొలి వారంలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో 40-41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. మార్చి 16 తర్వాత అకాల వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాబోయే 3 రోజులు పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు (సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా) నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.


