News August 16, 2024
ప్రశ్నించినందుకు వైద్యురాలి ఇంటికి పోలీసులు!

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన మరువక ముందే మరో వైద్యురాలికి చేదు అనుభవం ఎదురైంది. బర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు పోలీసులు అడ్రెస్ తెలుసుకొని తన ఇంటికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాత్రిపూట పోలీసులు ఇంటికి రావడంతో తన తల్లి భయాందోళనకు గురైందని, పోస్ట్ డిలీట్ చేయాలని వారు బెదిరించినట్లు చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
Similar News
News January 29, 2026
మొక్కజొన్నలో అధిక దిగుబడి రావాలంటే?

రబీ(యాసంగి)లో మొక్కజొన్నను సాగు చేస్తున్న రైతులు అధిక దిగుబడి సాధించాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. పంటలో చీడపీడల నియంత్రణతో పాటు మొక్క దశను బట్టి ఎరువులు, నీటి తడులను అందించాలి. లేకుంటే దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. మొక్కజొన్నకు ఈ సమయంలో అందించాల్సిన ఎరువులు, నీటి తడుల్లో జాగ్రత్తలు, కంకిలో చివరి వరకూ గింజ రావాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 29, 2026
సంజూ.. ఇదేం ఆటతీరు?

మొన్నటి వరకు సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేసినవారే ఇప్పుడు అతడి ఆటతీరుపై పెదవి విరుస్తున్నారు. ఇన్ని ఛాన్స్‌లు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడంలేదని మండిపడుతున్నారు. అతడి ఫుట్‌వర్క్ అస్సలు బాగోలేదంటున్నారు. వికెట్లను పూర్తిగా వదిలేసి క్లీన్ బౌల్డ్ అవుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. NZతో జరిగిన 3,4వ T20ల్లో అలాగే ఔటైన అతడు.. ఈ సిరీస్‌లో 4మ్యాచుల్లో 40రన్స్ మాత్రమే చేశారు.
News January 29, 2026
ఏకాదశి నాడు చేయకూడని పనులివే..

ఏకాదశి ధాన్యం తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. మద్యపానం అసలే చేయకూడదు. శారీరక సంయమనం పాటించాలి. బ్రహ్మచర్యం అవలంబించాలి. ఈ పవిత్ర తిథి నాడు తలంటు స్నానం చేయకూడదు. క్షవరం చేసుకోకూడదు. మనసులో కోపం, ద్వేషం వంటి ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు. అసత్యం చెప్పడం, ఇతరులను దూషించడం చేయకూడదు. సత్వగుణంతో ఉండాలి. విలాసాలకు దూరంగా ఉండాలి. పగలు నిద్రపోకూడదు. భగవన్నామ స్మరణలో గడపాలి.


