News May 19, 2024

సిట్ విచారణలో పోలీసులే దోషులుగా తేలుతారు: అంబటి

image

AP: కూటమి నాయకుల ఫిర్యాదుతో పోలీస్ ఉన్నతాధికారులను తప్పించిన చోటే హింస చెలరేగిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ‘ఇవాళ సిట్ బృందాన్ని కలిసి అన్ని అంశాలపై ఫిర్యాదు చేశా. TDP నుంచి డబ్బులు తీసుకున్న పోలీసులు పల్నాడులో సరిగ్గా పనిచేయలేదు. సిట్ విచారణలో వారే దోషులుగా తేలుతారు. నరసరావుపేట MLA ఇంటిపై TDP మూకలు రాళ్లు వేశాయి. మేం ఫిర్యాదుచేస్తే పోలీసులు పట్టించుకోలేదు’ అని మండిపడ్డారు.

Similar News

News October 18, 2025

DA బకాయిలు రూ.7వేల కోట్లు: సీఎం

image

AP: గత ప్రభుత్వం డీఏలను పెండింగ్‌లో పెట్టిందని, ఇప్పుడు రూ.7వేల కోట్ల బకాయిలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాలు మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్)పై ఎక్కువ ఖర్చు చేస్తే, ఏపీలో గత ప్రభుత్వం DBTకి పెద్దపీట వేసిందని విమర్శించారు. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

News October 18, 2025

7 వికెట్లతో సత్తా చాటిన షమీ

image

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన టీమ్ ఇండియా స్టార్ పేసర్ షమీ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నారు. ఉత్తరాఖండ్‌తో జరిగిన తొలి మ్యాచులో 7 వికెట్లు తీసి సత్తా చాటారు. దీంతో బెంగాల్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఫిట్‌నెస్ కారణంగా AUSతో సిరీస్‌కు షమీని దూరం పెట్టినట్లు సెలక్టర్లు ప్రకటించడం, ఆ వ్యాఖ్యలపై షమీ ఫైరవడం తెలిసిందే.

News October 18, 2025

పిశాచ స్థానం పట్ల నిర్లక్ష్యం వద్దు: వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు

image

పిశాచ స్థానాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ విషయం పట్ల అలసత్వం వహిస్తే ఇంట్లో ఉండేవారు ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇంటి చుట్టూరా ప్రహరీకి నడుమ ఉండే ఖాళీ స్థలాన్ని పిశాచ స్థానంగా చెబుతారు. ఇది ఉంటేనే గాలి, వెలుతురు ఇంట్లోకి వస్తాయి. ఇవి ఆ గృహంలో నివసించే వారికి ఉత్తేజాన్ని కలిగిస్తాయి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>