News May 4, 2024

పోలీసుల వాదన తప్పు: రోహిత్ సోదరుడు

image

TG: రోహిత్ వేముల కేసులో పోలీసుల <<13173448>>ప్రకటన<<>>పై అతని సోదరుడు రాజా అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల వాదన తప్పని అన్నారు. ఒక వ్యక్తి కులాన్ని పోలీసు అధికారి నిర్ణయించలేడని.. ఈ అంశంపై సీఎం రేవంత్‌ను కలుస్తామని చెప్పారు. దీనిపై అవసరమైతే పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News January 14, 2026

విశాఖ ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ సర్వీసులు నడపాలి: MLA

image

AP: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభమైనా విశాఖ నుంచి కొన్ని డొమెస్టిక్ విమాన సర్వీసులకైనా అవకాశమివ్వాలని MLA విష్ణుకుమార్ రాజు కోరారు. ‘VSP నుంచి ఏటా 30L మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. భోగాపురం చేరాలంటే 2 గంటల సమయం, ట్యాక్సీలకు ₹4500 వరకు ఖర్చు అవుతుంది. విజయవాడకు వందేభారత్ ట్రైన్లో 4 గంటల్లో చేరుకోవచ్చు. అదే భోగాపురం నుంచి విమానంలో వెళ్లాలంటే 6గంటలు పడుతుంది. ఖర్చూ ఎక్కువే’ అని పేర్కొన్నారు.

News January 14, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. పటాన్‌చెరు, లింగపల్లి, కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మేడ్చల్, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, గాజులరామారం ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వాన పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.

News January 14, 2026

ధోనీకే సాధ్యం కానిది.. రాహుల్ రికార్డు

image

భారత ప్లేయర్ KL రాహుల్ ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత సాధించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. రాజ్‌కోట్ వేదికగా వన్డేల్లో శతకం చేసిన తొలి ఇండియన్ కూడా ఈయనే. ఓవరాల్‌గా రాహుల్‌కిది వన్డేల్లో ఎనిమిదో సెంచరీ. ఈ ఏడాదిలో భారత్ తరఫున ఇదే తొలి అంతర్జాతీయ శతకం. సెంచరీ చేసిన సమయంలో తన కూతురుకు అంకితం ఇస్తున్నట్లుగా రాహుల్ సెలబ్రేట్ చేసుకున్నారు.