News September 18, 2024
పాలకులు మారినా విధానాలు కొనసాగుతాయి: సీఎం రేవంత్

TG: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఓపెన్ ఎకానమీకి శ్రీకారం చుట్టి గొప్ప ఆర్థిక విధానాలను తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులు మారినా విధానాలు అలాగే కొనసాగుతాయని చెప్పారు. 1995-2004 మధ్య చంద్రబాబు ఐటీ విప్లవాన్ని తీసుకొస్తే, వైఎస్ఆర్ దానిని కొనసాగించారన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. సంస్కరణల వల్లే ఐటీ, ఫార్మా రంగాల్లో నం.1గా ఉన్నామన్నారు.
Similar News
News November 26, 2025
‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్.. స్పందించిన హీరోయిన్

తాను నటించిన ‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై తమిళ నటి ఆండ్రియా జెరేమియా స్పందించారు. సినిమాలో బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డైరెక్టర్ అడిగితే పాత్ర కోసం ఏదైనా చేస్తానని ఆమె చెప్పారు. ఆండ్రియా పిశాచి, సైంధవ్, తడాఖా వంటి సినిమాల్లో నటించారు. పిశాచి-2 విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్లో తెరకెక్కింది. కోర్టు కేసు కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.
News November 26, 2025
ఫ్యాన్సీ క్రేజ్.. 8888 నంబర్కు భారీ ధర!

కార్ల ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకోసం కొందరు లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. కానీ హరియాణాలో ఓ వ్యక్తి ఏకంగా HR88B8888 నంబర్ ప్లేట్ కోసం ఏకంగా ₹కోటి పైనే వెచ్చించాడు. ఈ నంబర్ కోసం నిర్వహించిన వేలంలో 45 అప్లికేషన్లు వచ్చాయి. బిడ్డింగ్ ధర ₹50 వేలుగా నిర్ణయించగా రికార్డు స్థాయిలో ₹1.17 కోట్లు పలికింది. దేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్గా నిలిచింది.
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికలు.. హైకోర్టులో పిటిషన్లు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై పలు గ్రామాల ప్రజలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని అందులో పేర్కొన్నారు. వరంగల్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచ్, వార్డు రిజర్వేషన్లను సవాల్ చేశారు. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.


