News September 11, 2024

తక్కువ ధరకే మద్యం అందించేలా పాలసీ: కొల్లు రవీంద్ర

image

AP: నాసిరకం మద్యంతో గత YCP ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సొంత ఆదాయం పెంచుకునేలా లిక్కర్ పాలసీ తెచ్చి ప్రభుత్వ ఆదాయానికి జగన్ గండి కొట్టారని దుయ్యబట్టారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన మద్యం పాలసీ తీసుకొస్తామని తెలిపారు. OCT 1 నుంచే కొత్త విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జగన్ చేసిన తప్పులపై ప్రజలే తమకు రెడ్ బుక్ ఇచ్చారన్నారు.

Similar News

News October 14, 2025

పొద్దుతిరుగుడులో తెగుళ్ల నివారణకు ఇలా..

image

వరి కోతల తర్వాత పొద్దుతిరుగుడు పంటను సాధారణ దుక్కి పద్ధతిలో నవంబర్, డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. పంట తొలి దశలో చీడపీడలు, నెక్రోసిస్ వైరస్ తెగులు నివారణకు ఒక కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML కలిపి శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2-3టన్నుల పశువుల ఎరువు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎకరాకు 30KGల నత్రజని, 36KGల భాస్వరం, 12KGల పొటాషియం వేసుకోవాలి.

News October 14, 2025

విజయానికి 58 పరుగుల దూరంలో..

image

వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభమైంది. భారత్ గెలవడానికి మరో 58 రన్స్ అవసరం. దీంతో తొలి సెషన్‌లోనే ఇండియా విజయం సాధించే అవకాశం ఉంది. క్రీజులో రాహుల్(25), సుదర్శన్(30) ఉన్నారు. భారత్ ఈ మ్యాచులో గెలిస్తే రెండు టెస్టుల సిరీస్‌ క్లీన్‌స్వీప్ అవుతుంది.

News October 14, 2025

ట్రంప్‌కు 2026లోనైనా ‘శాంతి’ దక్కేనా?

image

8 యుద్ధాలు ఆపానని, తన కంటే అర్హుడు మరొకరు లేరని ఓ మినీ సైజ్ యుద్ధం చేసినా ట్రంప్‌కు 2025-నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. తాజాగా ఇజ్రాయెల్‌, పాక్ ఆయన్ను ఆ ప్రైజ్‌కు నామినేట్ చేశాయి. గడువులోగా నామినేషన్లు రాక ట్రంప్ పేరును నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకొని విషయం తెలిసిందే. వచ్చే JAN31 వరకు గడువు ఉండటంతో 2026 రేసులో ట్రంప్ ముందున్నట్లు తెలుస్తోంది. 2026లోనైనా పీస్ ప్రైజ్ ఆయన్ను వరిస్తుందా? మీ COMMENT.