News April 29, 2024
పొలిమేర-2 అరుదైన ఘనత

చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ‘పొలిమేర-2’ అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైనట్లు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. చేతబడి ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. కాగా త్వరలోనే మూడో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News October 30, 2025
నకిలీ మద్యం కేసు: ముగిసిన నిందితుల కస్టడీ

AP: నకిలీ మద్యం కేసులో జనార్దన్, జగన్మోహనరావు కస్టడీ ముగియగా VJA కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి స్టేట్మెంట్లను అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావు చెప్పగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో సైతం కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ 7 రోజుల పాటు ఎక్సైజ్, సిట్ అధికారులు ప్రశ్నించారు.
News October 30, 2025
సెంచరీ భాగస్వామ్యం.. ఉత్కంఠగా మ్యాచ్

WWCలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమ్ఇండియా బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(81*), హర్మన్ ప్రీత్(66*) అర్ధసెంచరీలు చేశారు. 59 పరుగులకే ఓపెనర్లు ఔటవ్వగా వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలోకి చేర్చారు. ప్రస్తుతం భారత్ స్కోరు 198/2. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News October 30, 2025
ముంబై కిడ్నాప్.. ఆ 35 నిమిషాలు ఏం జరిగింది?

ముంబై <<18151381>>కిడ్నాప్ <<>>ఘటనలో క్విక్ రియాక్షన్ టీమ్ 35 నిమిషాల ఆపరేషన్ నిర్వహించింది. 8మంది కమాండర్ల టీమ్ బాత్రూమ్ ద్వారా స్టూడియోలోకి వెళ్లింది. తొలుత నిందితుడు రోహిత్తో చర్చలు జరిపింది. కానీ లోపలికొస్తే షూట్ చేస్తానని, గదిని తగలబెడతానని అతడు బెదిరించాడు. తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రోహిత్పై లీడ్ కమాండో కాల్పులు జరిపి గాయపరిచారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా అక్కడ రోహిత్ చనిపోయాడు.


