News July 26, 2024
గాజాకు పోలియో ముప్పు?

గాజాలోని మురుగునీటి శాంపిళ్లలో పోలియోకారక వైరస్ అవశేషాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. దీంతో గాజాలోని చిన్నారులకు 10 లక్షల పోలియో టీకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. పోలియో, హెపటైటిస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, విరేచనాలు కేసులు భారీగా పెరిగినట్లు అంచనా వేసింది. కాగా దాదాపు ఏడాదిగా గాజాలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
Similar News
News October 15, 2025
అడ్డగోలు NOCలు.. 55 మంది ఇంజినీర్లపై వేటు

HYD పరిధిలో చెరువులు, కుంటలు, కాల్వల పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తూ NOCలు జారీ చేసిన ఇంజినీర్ల(SE, EE, AEE, DEE) భరతం పట్టింది నీటిపారుదల శాఖ. పైరవీలు, పలుకుబడితో ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన 55 మందిని ఇతర జిల్లాలకు పంపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. బదిలీలపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉండటంతో వర్కింగ్ అరేంజ్మెంట్ పేరుతో ఇతర జిల్లాలకు పంపింది. వారి స్థానాల్లో ఇతర జిల్లాల వారిని ODపై తీసుకొచ్చింది.
News October 15, 2025
EPFO ఖాతాదారులకు అలర్ట్

PF అకౌంట్ ఉన్న వారు ఎక్కువకాలం ఉపాధి లేకుండా కొనసాగిన సందర్భాల్లోనే పూర్తిగా నగదు ఉపసంహరణ చేసుకునేలా EPFO సెంట్రల్ బోర్డు అనుమతిచ్చింది. ఏడాదిగా ఉద్యోగం లేని వారు EPF తుది పరిష్కారానికి, 3 ఏళ్లు ఉపాధి లేని వారు PF డబ్బుతో పాటు పెన్షన్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం 2 నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న వారు ఖాతాల్లోని నిధులను పూర్తిగా ఖాళీ చేస్తుండటంతో EPFO ఈ నిర్ణయం తీసుకుంది.
News October 15, 2025
గుండెపోటుతో గోవా మాజీ సీఎం కన్నుమూత

గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్(79) కన్నుమూశారు. ఇంట్లో నిన్న రాత్రి ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి ఒంటిగంట సమయంలో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ 3PMకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నాయక్ మృతి పట్ల పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవకు జీవితం అంకితం చేశారని కొనియాడారు.