News January 28, 2025

POLITICAL: విశాఖ వైసీపీకి పెద్దన్న గుడివాడేనా?

image

ఉమ్మడి విశాఖ YCPలో ఇప్పటి వరకు వలస నేతలే ఆధిపత్యం చెలాయించేవారన్న విమర్శలున్నాయి. గతంలో రీజనల్ కో-ఆర్డినేటర్లుగా విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి వంటి వారు ఉండటమే దీనికి కారణం. కాగా..విజయసాయిరెడ్డి,అవంతి,ఆడారి రాజీనామాతో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, చోడవరం ఇన్‌ఛార్జ్‌గా మాజీమంత్రి అమర్నాథ్‌‌కు బాధ్యతలు అప్పగించారు. గుడివాడ తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై దాడి చేస్తూ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.

Similar News

News November 16, 2025

వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: ప్రణవ్

image

సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావటంతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పెద్దఎత్తున ఒప్పందాలు జరగటంతో వైసీపీ నేతలు భయపడి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డు మంత్రిగా పేరొందిన అమర్ నాథ్ ఉన్న ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.

News November 16, 2025

ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా జీతం చెల్లింపుపై RINL సర్క్యులర్

image

విశాఖ స్టీల్ ప్లాంట్, RINL సర్క్యులర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ఉద్యోగుల జీతం ఇకపై సాధించిన ఉత్పత్తి లక్ష్యాల శాతానికి అనుగుణంగా చెల్లించబడుతుంది. గతంలో లక్ష్యాలు చేరుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 8 గంటల పాటు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు, సంస్థ నిబంధనల ప్రకారం పూర్తి జీతం ఇవ్వాలని కార్మిక సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నూతన విధానం అమలుపై ప్లాంట్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

News November 16, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ కలెక్టరేట్‌లో ఈనెల 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదేవిధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.