News January 28, 2025
POLITICAL: వైసీపీకి పెద్దన్న గుడివాడేనా?

ఉమ్మడి విశాఖ YCPలో ఇప్పటి వరకు వలస నేతలే ఆధిపత్యం చెలాయించేవారన్న విమర్శలున్నాయి. గతంలో రీజనల్ కో-ఆర్డినేటర్లుగా విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి వంటి వారు ఉండటమే దీనికి కారణం. కాగా..విజయసాయిరెడ్డి,అవంతి,ఆడారి రాజీనామాతో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, చోడవరం ఇన్ఛార్జ్గా మాజీమంత్రి అమర్నాథ్కు బాధ్యతలు అప్పగించారు. గుడివాడ తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై దాడి చేస్తూ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.
Similar News
News October 18, 2025
తిరుపతి హాథీరాంజీ మఠం పూర్తిగా శిథిలం.?

తిరుపతిలోని హాథీరాంజీ మఠంపై అధికారుల అధ్యయనం పూర్తి అయినట్లు సమాచారం. మఠంలోని చాలా భాగం పూర్తిగా శిథిలం అయినట్లు తెలుస్తోంది. అధికారులు, స్థానిక నాయకులు హాథీరాంజీ వంశస్థులతో చర్చలు జరిపి తుది నిర్ణయాన్ని త్వరలోనే తీసుకోనున్నారట. కూలగొట్టే పరిస్థితి వస్తే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు ఇచ్చి ప్రాచీన కట్టడాలు కాపాడుకొనేలా ప్రయత్నం చేయాలని బంజారా సంఘాలు కోరుతున్నట్లు సమాచారం.
News October 18, 2025
రాష్ట్రంలో 34 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News October 18, 2025
పత్తి కొనుగోళ్లు, కౌలు రైతు నమోదుపై ADB కలెక్టర్ సమీక్ష

జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు, క్రాప్ బుకింగ్, పంట నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.