News January 28, 2025
POLITICAL: వైసీపీకి పెద్దన్న గుడివాడేనా?

ఉమ్మడి విశాఖ YCPలో ఇప్పటి వరకు వలస నేతలే ఆధిపత్యం చెలాయించేవారన్న విమర్శలున్నాయి. గతంలో రీజనల్ కో-ఆర్డినేటర్లుగా విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి వంటి వారు ఉండటమే దీనికి కారణం. కాగా..విజయసాయిరెడ్డి,అవంతి,ఆడారి రాజీనామాతో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, చోడవరం ఇన్‌ఛార్జ్‌గా మాజీమంత్రి అమర్నాథ్‌కు బాధ్యతలు అప్పగించారు. గుడివాడ తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై దాడి చేస్తూ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.
Similar News
News February 18, 2025
BREAKING: కొత్త CECగా జ్ఞానేశ్ కుమార్

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జ్ఞానేశ్ కుమార్ పేరు గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతుండగా ఈరోజు అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రస్తుత CEC రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుంది.
News February 18, 2025
ఎండాకాలం: ఈసారి హాటెస్ట్ సిటీగా బెంగళూరు!

దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది. ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని పేర్కొంది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.
News February 18, 2025
కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

✓ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు✓ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మార్కెట్‌లో పత్తి ధర రూ.6,900✓ శంకరపట్నం మండలంలో తాగుడుకు బానిసై ఒక వ్యక్తి ఆత్మహత్య✓ ముస్లిం ఉద్యోగుల పని వేళల్లో మార్పులు✓ రామడుగు మండలంలో పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం✓ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో నేతలు