News December 31, 2024

2024లో BRSకు రాజకీయ సవాళ్లు

image

April 27, 2001లో TRSను KCR స్థాపించిన నాటి నుంచి ఎన్న‌డూ లేని విధంగా లోక్‌స‌భ‌లో ఆ పార్టీ ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. 2004లో 5 సీట్లు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ 2024లో ఖాతా తెర‌వ‌క‌పోవ‌డం రాజ‌కీయంగా ఆ పార్టీకి దెబ్బ అనే చెప్పాలి. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత అరెస్టు, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార‌డం వంటి ప‌రిణామాలు 2024లో BRSకు రాజ‌కీయంగా స‌వాల్ విసిరాయి.

Similar News

News January 25, 2026

BRSలో గెలిచా.. కాంగ్రెస్‌తో పనిచేస్తున్నా: కడియం

image

TG: ఎమ్మెల్యేల అనర్హతపై వివాదం కొనసాగుతున్న వేళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో పనిచేస్తున్నట్లు తెలిపారు. ‘ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రచారం చేస్తారని అంతా అడుగుతున్నారు. నేను కాంగ్రెస్‌కే ఓటు వేయాలని చెబుతా. రేవంత్‌ ఐదేళ్లు సీఎంగా ఉంటారు. ఆయనకు ఎమ్మెల్యేలతోపాటు ప్రజల సపోర్టు ఉంది’ అని చెప్పారు.

News January 25, 2026

కలశంపై కొబ్బరికాయను ఎందుకు పెడతారు?

image

కొబ్బరికాయ బ్రహ్మాండానికి సంకేతం. అలాగే సృష్టి అంతటా నిండి ఉన్న భగవంతుని స్వరూపంగా కొలుస్తారు. కాయపై ఉండే పొర చర్మం, పీచు మాంసం, చిప్ప ఎముకలు, లోపలి కొబ్బరి ధాతువు, నీళ్లు ప్రాణాధారం, పీచు జ్ఞానానికి, అహంకారానికి ప్రతీకలు. పసుపు రాసిన వెండి లేదా రాగి కలశంపై ఆకులు, కొబ్బరికాయను ఉంచి వస్త్రంతో అలంకరిస్తే అది పూర్ణకుంభంగా మారుతుంది. ఇది దివ్యమైన ప్రాణశక్తి నిండిన జడ శరీరానికి ప్రతీకగా నిలుస్తుంది.

News January 25, 2026

గణతంత్ర దినోత్సవాన అత్యున్నత గౌరవం

image

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతితో కలిసి జెండా ఆవిష్కరణలో పాల్గొనే అవకాశాన్ని ఫ్లైట్ లెఫ్టినెంట్ అక్షితా ధంకర్ దక్కించుకున్నారు. హర్యానాకి చెందిన అక్షిత NCCలో చేరి క్యాడెట్ సార్జెంట్ మేజర్‌ స్థాయికి చేరుకున్నారు. తర్వాత NFTAC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. తక్కువ వ్యవధిలోనే ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాకు చేరుకున్న ఆమె తాజాగా ఈ అత్యున్నత గౌరవాన్ని సొంతం పొందారు.