News October 15, 2024
ఝార్ఖండ్ రాజకీయ ముఖచిత్రం

2019 ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాల్లో JMM(30)-కాంగ్రెస్ (16) కూటమి 46 సీట్లు గెలిచి అధికారాన్ని చేపట్టింది. BJP 25 సీట్లు గెలిచింది. JMM నేత హేమంత్ సోరెన్ CM అయ్యారు. అయితే మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది Jan 31న ED ఆయన్ను అరెస్టు చేయడంతో శిబు సోరెన్ సన్నిహితుడు చంపై సోరెన్ CM అయ్యారు. Jun 28న జైలు నుంచి విడుదలైన హేమంత్ మళ్లీ CM పదవి చేపట్టడంతో చంపై పార్టీని వీడి BJPలో చేరారు.
Similar News
News January 23, 2026
ఇంటర్నేషనల్ క్రికెట్లో పదేళ్లు.. బుమ్రా మ్యాజిక్ ఇదే!

బుల్లెట్ల లాంటి యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే భారత స్టార్ బౌలర్ బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ వల్ల ఎక్కువ రోజులు ఆడలేరన్న విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ పదేళ్లలో టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 103W తీశారు. 2024లో ICC క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు. రానున్న T20 WCలో IND బౌలింగ్ దళాన్ని బుమ్రానే నడిపించనున్నారు.
News January 23, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.5,400 పెరిగి రూ.1,59,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,950 ఎగబాకి రూ.1,46,400గా ఉంది. కిలో వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,60,000గా నమోదైంది.
News January 23, 2026
తిరుమల అప్డేట్.. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 64,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,634 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా నమోదైంది.


