News September 16, 2024
స్టీల్ ప్లాంట్పై రాజకీయ సెగలు.. గతంలానే టీడీపీ కార్నర్!

AP: విశాఖ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్-3ను నిలిపేయడం రాజకీయ చిచ్చుకి ఆజ్యం పోసింది. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం చూస్తోందని విపక్షాలంటున్నాయి. ప్లాంట్ను కాపాడలేకుంటే కేంద్రం నుంచి కూటమి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ప్రత్యేక హోదా విషయంలోనూ TDPని విపక్షాలు ఇలాగే కార్నర్ చేశాయి. ఏదేమైనా స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయమైనా APలో రాజకీయంగా పెను దుమారమే రేపనుంది.
Similar News
News October 19, 2025
గూగుల్ రాక ఆరంభం మాత్రమే: లోకేశ్

దేశంలోని చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులున్నాయని, కానీ APలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. AUSలోని తెలుగువారితో మాట్లాడుతూ ‘ఇక్కడి వారంతా AP అంబాసిడర్లలా పని చేయాలి. పెట్టుబడుల కోసం పక్క రాష్ట్రాలతో చిన్నచిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను ఎన్నో మాటలు అంటున్నా క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తున్నా. గూగుల్ రాక ఆరంభం మాత్రమే. ఇకపై అనేక కంపెనీలు వస్తాయి’ అని తెలిపారు.
News October 19, 2025
దీపావళి: దీపారాధనకు ఏ నూనె ఉత్తమం?

దీపారాధనకు ఆవు నెయ్యి, నువ్వుల నూనె శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ‘ఆవు నెయ్యి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ నూనె దుష్ఫలితాలు కలగనివ్వకుండా చేస్తుంది. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే దాంపత్యం అన్యోన్యం అవుతుంది. ఆవు నెయ్యిలో వేప నూనె కలిపి వెలిగిస్తే విజయం లభిస్తుంది. అయితే వేరుశెనగ నూనె వాడకూడదు’ అని సూచిస్తున్నారు.
News October 19, 2025
ఎన్నికల రోజు పెయిడ్ హాలిడే ఇవ్వకుంటే జరిమానా: ఈసీ

ఎన్నికలు జరిగే రోజు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వకపోతే జరిమానా విధిస్తామని యాజమాన్యాలను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఉప ఎన్నికలు జరిగే సెగ్మెంట్లకూ ఇది వర్తిస్తుందని, ఎవరి వేతనాల్లోనూ కోత విధించరాదని సూచించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నా పోలింగ్ రోజు ఈ ప్రయోజనం పొందడానికి అర్హులేనని చెప్పింది. దీనిపై రాష్ట్రాలు ఉత్తర్వులు ఇవ్వాలంది.