News October 5, 2024
జమ్మూకశ్మీర్లో రాజకీయ వేడి

ఎన్నికల ఫలితాలు వెలువడకముందే JKలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. J&K Reorganisation Act, 2019 సహా జులై, 2023లో చేసిన సవరణల ద్వారా ఐదుగురు MLAలను LG నామినేట్ చేయగలరు. కేంద్ర హోం శాఖ సూచలన మేరకు ఆయన ఐదుగురిని నియమించనున్నారు. వీరికి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కల్పిస్తే Halfway Mark 45కి బదులుగా 48 అవుతుంది. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే అని విపక్షాలు మండిపడుతున్నాయి.
Similar News
News November 5, 2025
గవర్నమెంట్ షట్ డౌన్లో US రికార్డ్

షార్ట్ టర్మ్ గవర్నమెంట్ ఫండింగ్ బిల్లు 14వసారీ US సెనేట్లో తిరస్కరణకు గురైంది. 60 ఓట్లు కావాల్సి ఉండగా.. 54-44 తేడాతో బిల్ పాస్ కాలేదు. US చరిత్రలో లాంగెస్ట్ షట్డౌన్(35 డేస్)గా రికార్డులకెక్కింది. ఇప్పటికే అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. షట్డౌన్ ఆరోవారంలోకి ప్రవేశిస్తే సిబ్బంది కొరత వల్ల కొన్ని ఎయిర్ స్పేస్ సెక్షన్స్ క్లోజ్ కూడా కావొచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
News November 5, 2025
సినీ ముచ్చట్లు

* చికిరి అంటే ఏంటో ఇవాళ ఉ.11.07కు తెలుసుకోండి: డైరెక్టర్ బుచ్చిబాబు
* అఖండ-2 మూవీ నుంచి ఇవాళ సా.6.03 గంటలకు మ్యాసీవ్ అప్డేట్ ఉంటుంది: తమన్
* ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక్కో సీన్కి స్క్రీన్ బద్దలైపోతుంది. చాలారోజుల తర్వాత సాంగ్స్లో కళ్యాణ్ గారు డాన్స్ ఇరగదీశారు: దేవీశ్రీ ప్రసాద్
*
News November 5, 2025
నవంబర్ 5: చరిత్రలో ఈరోజు

1877: సంస్కృతాంధ్ర పండితులు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
1925: కవి, రచయిత ఆలూరి బైరాగి జననం
1987: మహాకవి దాశరథి కృష్ణమాచార్య మరణం (ఫొటోలో లెఫ్ట్)
1988: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జననం (ఫొటోలో రైట్)
2019: నటుడు, దర్శకుడు కర్నాటి లక్ష్మీనరసయ్య మరణం
☛ ప్రపంచ సునామీ దినోత్సవం


