News January 30, 2025
Politics: నేడు దద్దరిల్లనున్న GHMC!

నేటి GHMC కౌన్సిల్ మీటింగ్తో హాల్ దద్దరిల్లనుంది. 2025-26 వార్షిక బడ్జెట్ను ఆమోదించడం ఎజెండా. అయితే, FEB 11న గవర్నింగ్ బాడీకి 4 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సమయంలో మేయర్పై BRS అవిశ్వాసానికి ప్లాన్ చేయగా, కౌన్సిల్ మీటింగ్లో BJP గళం వినిపించాలని ఆ పార్టీ అగ్రనేతలు కార్పొరేటర్లకు సూచించారు. ఇక HYDలో బలం పెంచుకున్న INC వీటిని తిప్పికొట్టే యోచనలో ఉంది. దీంతో ఈ కౌన్సిల్ మీటింగ్ పొలిటికల్ హీట్ పెంచింది.
Similar News
News November 10, 2025
HYD: హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు

నిజాంపేట మున్సిపాలిటీలోని కోశల్యానగర్లో హైడ్రా కాపాడిన 300 గజాల బనియన్ ట్రీ పార్కులో స్థానికులు కార్తీకమాసం సందర్భంగా వనభోజనాలు నిర్వహించారు. ఆక్రమణదారులు కబ్జా చేసిన ఈ పార్కును హైడ్రా రక్షించి కాలనీవాసులకు అప్పగించింది. దీంతో కృతజ్ఞతగా వెయ్యి మంది నివాసితులు పార్కులో సత్యనారాయణ వ్రతం ఆచరించారు. పిల్లలు, పెద్దలు ‘హైడ్రా జిందాబాద్’ అంటూ నినాదాలు చేసి, ప్లకార్డులు ప్రదర్శించారు.
News November 9, 2025
HYD: రమణీయం.. ఈ సూర్యాస్తమయం

బుగ్గజాతర రూట్లో ఇవాళ అద్భుతమైన దృశ్యం ఆకట్టుకుంది. తాటిచెట్ల మధ్య సూర్యాస్తమయం కనువిందు చేసింది. చల్లటి గాలులతో కూడిన వాతావరణం జనాలని కట్టి పడేస్తుంది. పట్టణం నుంచి వచ్చే వారు గ్రామీణ వాతావరణంలో ఆనందంగా గడిపేస్తున్నారు. బుగ్గ జాతరకు వెళ్తే జాపాల, ఆరుట్ల, తిప్పాయిగూడ గ్రామాల మీదుగా రాచకొండ ఫోర్ట్ను సందర్శించండి. ఈ రూట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అస్సులు మరిచిపోలేరు.
News November 9, 2025
శంషాబాద్: మూడు విమానాలు రద్దు

వివిధ గమ్యస్థానాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి HYD రావాల్సిన విమానం, జైపూర్ నుంచి HYD రావల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. అలాగే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి.


