News January 30, 2025

Politics: నేడు దద్దరిల్లనున్న GHMC!

image

నేటి GHMC కౌన్సిల్ మీటింగ్‌తో హాల్ దద్దరిల్లనుంది. 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించడం ఎజెండా. అయితే, FEB 11న గవర్నింగ్ బాడీకి 4 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సమయంలో మేయర్‌పై BRS అవిశ్వాసానికి ప్లాన్ చేయగా, కౌన్సిల్ మీటింగ్‌లో BJP గళం వినిపించాలని ఆ పార్టీ అగ్రనేతలు కార్పొరేటర్లకు సూచించారు. ఇక HYDలో బలం పెంచుకున్న INC వీటిని తిప్పికొట్టే యోచనలో ఉంది. దీంతో ఈ కౌన్సిల్ మీటింగ్‌ పొలిటికల్ హీట్‌ పెంచింది.

Similar News

News November 28, 2025

చిత్తూరు: ‘జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలి’

image

అర్హులైన పేదలకు ప్రభుత్వాల సంక్షేమ పథకాలను చేరువచేసి, వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. చిత్తూరు కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ZP సీఈవో రవికుమార్ ఉన్నారు.

News November 28, 2025

గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

image

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.

News November 28, 2025

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఫోరమ్‌కు 21 వినతులు

image

జీవీఎంసీలో శుక్రవారం నిర్వహించిన ‘టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్’కు 21 వినతులు వచ్చినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. సాధారణ స్పందనలో రద్దీ తగ్గించేందుకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జోన్-3 నుంచి అత్యధికంగా 7 అర్జీలు రాగా.. స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.