News October 15, 2024

రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరు: రాజ్‌నాథ్

image

TG: రాజకీయంగా పార్టీలు వేరైనప్పటికీ దేశాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరు. దేశ రక్షణ రంగంలో నేవీ రాడార్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి CM రేవంత్ చేసిన కృషి అభినందనీయం. కలాం జయంతి రోజున ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది’ అని దామగుండంలో రాడార్ స్టేషన్‌‌కు శంకుస్థాపన అనంతరం వ్యాఖ్యానించారు.

Similar News

News October 15, 2024

DOPT ఉత్తర్వులు పాటించాల్సిందే.. క్యాట్ తీర్పు

image

తమను APకి వెళ్లాలంటూ DOPT జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న IASలు వేసిన పిటిషన్‌పై CAT కీలక తీర్పునిచ్చింది. వారు ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఐఏఎస్‌ల విజ్ఞప్తిని తిరస్కరించింది. రేపు యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో వాకాటి అరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది.

News October 15, 2024

స్నేహితుడి హత్య.. సల్మాన్‌కు భద్రత పెంపు

image

రాజకీయ నేత బాబా సిద్ధిఖీ <<14343654>>హత్య నేపథ్యంలో<<>> బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ భద్రతను Y+ కేటగిరీకి ప్రభుత్వం పెంచింది. ఆయన భద్రతపై ఆందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన బయటకు వెళ్లిన సమయంలో పోలీస్ ఎస్కార్ట్‌ వెంట ఉండనుంది. బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ కూడా Y+ సెక్యూరిటీ కలిగి ఉన్నారు. ఈ కేటగిరీలో ఇద్దరు PSOలతో పాటు 11 మంది సిబ్బందిని భద్రతగా కేటాయిస్తారు.

News October 15, 2024

ప్రజలకు సేవ చేయాలని లేదా?: IASలకు CAT ప్రశ్న

image

తమను APకి వెళ్లాలంటూ DOPT జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న IASలు CATలో కోరారు. తాము తెలంగాణలోనే ఉంటామని IASలు ఆమ్రపాలి, కరుణ, వాణిప్రసాద్ CATలో వాదించారు. దీంతో ఏపీలో ప్రజలు వరదలతో అల్లాడుతున్నారని, అలాంటి చోటకు వెళ్లి సేవ చేయాలని లేదా అని IASలను క్యాట్ ప్రశ్నించింది. ప్రస్తుతం DOPT వాదనలను క్యాట్ వింటోంది.