News March 23, 2025
విశాఖ మేయర్ పీఠంపై రాజకీయం

AP: విశాఖ మేయర్‌పై కూటమి నేతలు <<15849529>>అవిశ్వాస తీర్మాన<<>> నోటీస్ ఇవ్వడంతో వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ మండలి ప్రతిపక్ష నేత బొత్స, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అవిశ్వాసం నెగ్గకుండా ఉండేందుకు సమాలోచనలు చేశారు. అవసరమైతే క్యాంప్ రన్ చేయాలని నిర్ణయించారు. GVMCలో 98 స్థానాలుండగా, వైసీపీ కార్పొరేటర్ల చేరికలతో కూటమి బలం 70(+11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు)కి చేరింది.
Similar News
News March 25, 2025
నేలమట్టం కానున్న గబ్బా స్టేడియం

2021లో AUSపై గబ్బా స్టేడియం(బ్రిస్బేన్)లో టీమ్ఇండియా టెస్టు విజయం అపూర్వమైనది. 130ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేడియాన్ని 2032 ఒలింపిక్స్ తర్వాత కూల్చివేయనున్నట్లు క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం తెలిపింది. 1895లో నిర్మించిన ఈ స్టేడియం శిథిలావస్థకు చేరింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2032తర్వాత క్రికెట్ మ్యాచులన్నీ బ్రిస్బేన్ విక్టోరియా పార్క్ వద్ద నిర్మించనున్న స్టేడియంలో నిర్వహిస్తారు.
News March 25, 2025
ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CRRIలో 209 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం, ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900-63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500-81,000 జీతం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.500. ఏప్రిల్ 21 వరకు <
News March 25, 2025
IPL.. వ్యూస్‌లో తగ్గేదే లే!

IPL మ్యాచ్‌లు భారీగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ నెల 22న KKR, RCB జట్ల మధ్య మ్యాచ్‌తో సీజన్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 4 మ్యాచులు అలరించాయి. కాగా, స్టార్‌స్పోర్ట్స్‌లో 25.3 కోట్లు, జియో హాట్‌స్టార్‌లో 137 కోట్ల వ్యూస్ వచ్చినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అలాగే 5K కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదైనట్లు వెల్లడించాయి. ధనాధన్ ఆటతో అలరిస్తున్న IPL ఏటికేడు భారీ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటోంది.