News November 16, 2024

Politics: నినాదం వెనుక రాజ‌కీయం(2/2)

image

కాంగ్రెస్ ఉద్ధృతంగా డిమాండ్ చేస్తున్న కుల‌గ‌ణ‌నకు కౌంట‌ర్ ఇవ్వ‌డానికి PM మోదీ ఏక్ హైతో సేఫ్ హై పిలుపునిచ్చారు. మ‌త‌ప‌ర‌మైన కోణంలో UP CM యోగి బ‌టేంగే తో క‌టేంగే నినాదమిచ్చారు. BJP విద్వేషపూరిత రాజ‌కీయాల‌ను ఎదుర్కొవ‌డానికి భ‌య‌ప‌డొద్దు, భ‌య‌ప‌డితే చ‌స్తారు అంటూ కాంగ్రెస్ నిన‌దించింది. ఝార్ఖండ్‌లో చొర‌బాటుదారుల్ని ఎన్నికల అంశంగా మార్చి రోటీ-బేటీ-ఔర్ మ‌ట్టి అంటూ గిరిజ‌నుల‌పై BJP స్లోగ‌న్ వ‌దిలింది.

Similar News

News February 9, 2026

KNR: కీలకం కానున్న స్వతంత్ర అభ్యర్థులు..?

image

ఉమ్మడి KNR జిల్లాలో మున్సిపల్ ఎన్నికలల్లో ప్రధాన పార్టీలకు తీసిపోకుండా స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కని వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 51 మంది స్వతంత్రులు గెలుపొంది కొన్ని చోట్ల ఛైర్మన్ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 415 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వీరు గెలిస్తే కీలకం మరే అవకాశం ఉంది.

News February 9, 2026

పిల్లల్లో ఆకలి ఎందుకు తగ్గుతుందంటే?

image

పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం, పాలు ఎక్కువగా తాగడం, చిరుతిళ్లు తినడం, నులిపురుగులు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆకలి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం, పండ్లు, సూప్స్‌ పెట్టాలి. జంక్‌ ఫుడ్‌ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఊబకాయం, అనారోగ్యాలు వస్తాయి. ఫోన్లు, టీవీ చూపించి అన్నం పెట్టొద్దు. దీనితో అర్టిజం, హైపర్‌ యాక్టివ్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

News February 9, 2026

ఎండిన మామిడి ఆకులు తోరణాలుగా ఉండకూడదా?

image

ఎండిన మామిడి ఆకులు గుమ్మానికి ఉండటం అశుభంగా భావిస్తారు. అవి నల్లగా మారినా వెంటనే తొలగించాలి. లేకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని నమ్ముతారు. ఇంట్లో ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంటుందట. అందుకే ఎండిన తోరణాలను తొలగించి అవసరమైతే మూలా నక్షత్రం రోజున, ఇతర శుభ ముహూర్తాల్లో కొత్త పచ్చని మామిడి ఆకులను కట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఇంటికి సానుకూల శక్తి చేకూరి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.