News December 22, 2024
పోలింగ్ బూత్ వీడియోలు ఇవ్వడం కుదరదు: ఈసీ
ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. అభ్యర్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే డాక్యుమెంట్ల పరిధిలోకి సీసీటీవీ ఫుటేజీ రాదని పేర్కొంది. నిబంధనల సవరణపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కారు, ఈసీ కలిసి ఎన్నికల్లో పారదర్శకతను తొలగిస్తున్నారని విమర్శించింది.
Similar News
News December 22, 2024
పేర్ని నానికి పోలీసుల నోటీసులు
AP: మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టిన కేసులో విచారణకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా హాజరు కావాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆయన ఇంటి తలుపులకు నోటీసులు అంటించినట్లు సమాచారం.
News December 22, 2024
ఘోర ప్రమాదం.. 38 మంది మృతి
ఆఫ్రికా దేశం కాంగోలోని బుసిరా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 38 మంది మరణించారు. 100 మందికి పైగా గల్లంతయ్యారు. సుమారు 400 మంది ఫెర్రీలో క్రిస్మస్ వేడుకల కోసం స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
News December 22, 2024
దేశీయ చాయ్‌కి అమెరికా ‘ఆరోగ్య’ గుర్తింపు
భారతీయులు అమితంగా ఇష్టపడే చాయ్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. దేశీయ తేయాకుగా ప్రసిద్ధి చెందిన కమెల్లియా సైనెన్సిస్‌తో తయారు చేసిన టీని ఆరోగ్యకరమైన పానీయంగా US Food and Drug Administration గుర్తించింది. ఈ నిర్ణయాన్ని నార్త్ ఈస్టర్న్ టీ, ఇండియన్ టీ అసోసియేషన్లు స్వాగతించాయి. అంతర్జాతీయ టీ పరిశ్రమకు ఇదో అద్భుతమైన వార్త అని అమెరికా టీ అసోసియేషన్ అధ్యక్షుడు పీటర్ ఎఫ్ గోగ్గి పేర్కొన్నారు.