News May 13, 2024

ఆ గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ!

image

TG: ఖమ్మం(D) ఏన్కూరు(M) రాయమాదారం గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదని పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు యాదాద్రి జిల్లా పోచంపల్లి(M) కనుముక్కలలో రైతులు ధర్నా చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.

Similar News

News February 3, 2026

అడుగులోనే అరక విరిగిందట

image

పొలం దున్నడానికి ఉపయోగించే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు అరక. పొలం దున్నడం మొదలుపెట్టి, ఒక అడుగు వేయకముందే లేదా మొదటి అడుగులోనే, ప్రధానమైన పనిముట్టు అయిన అరక విరిగిపోతే పని ముందుకు సాగదు. ఏదైనా ఒక కార్యాన్ని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించిన తక్షణమే ఊహించని సమస్య లేదా అవాంతరం ఎదురై మొత్తం ప్రణాళిక లేదా ప్రయత్నం విఫలమైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు.

News February 3, 2026

ఇంట్లో పెద్ద విగ్రహాలు ఉన్నాయా?

image

ఇంట్లో అంగుళం కన్న పెద్ద విగ్రహాలు ఉండకూడదు. ఉంటే నిత్య పూజలు చేయాలి. ఎందుకంటే పెద్ద విగ్రహాలకు చాలా ఆకర్షణ శక్తి ఉంటుంది. దాన్ని ఇల్లు భరించలేదు. అలాగే దైవారాధనకు సగుణ, నిర్గుణ అనే 2 మార్గాలున్నాయి. అందులో విగ్రహ పూజ సగుణోపాసన. దీనికి కొన్ని నియమాలుంటాయి. దాని ప్రకారం అంగుళం కన్నా పెద్ద విగ్రహం ఇంట్లో ఉంటే కఠిన నియమాలతో నిత్య పూజలు తప్పక చేయాలి. లేనిపక్షంలో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.

News February 3, 2026

మెగాస్టార్ మూవీలో మోహన్‌లాల్!

image

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ మరోసారి తెలుగు స్ట్రెయిట్‌ మూవీలో నటించనున్నట్లు తెలిసింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్‌ యాక్షన్‌ మూవీ తెరకెక్కనుంది. ‘మెగా 158’ వర్కింగ్‌ టైటిల్‌. ఈ నెలలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. దీనిలో మోహన్‌లాల్‌ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. ఇప్పటికే మూవీ టీమ్ ఆయనతో సంప్రదింపులు పూర్తి చేసిందట. గతంలో ఆయన ‘జనతా గ్యారేజ్’లో నటించారు.