News March 20, 2024

పోలింగ్ రోజు ఆ రాష్ట్రంలో సెలవు

image

లోక్‌సభ ఎన్నికలు జరిగే రోజు సెలవు ఇస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. APR 19, 26న పోలింగ్ ఉండటంతో ఆ 2 రోజులు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పెయిడ్ హాలిడేగా ప్రకటించింది. ఇది రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రైవేటు కంపెనీలు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంది. మరి ఇక్కడా సెలవు ఇవ్వాలంటారా? కామెంట్ చేయండి.

Similar News

News November 1, 2024

ఫ్రీ గ్యాస్.. నేడే ప్రారంభం

image

AP: ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం నేడు ప్రారంభం కానుంది. శ్రీకాకుళం(D) ఈదుపురంలో ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏలూరు(D) ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేస్తారు. కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి. పూర్తి మొత్తం ఇచ్చి సిలిండర్‌ను తీసుకుంటే 48 గంటల్లో సబ్సిడీని ప్రభుత్వం జమ చేస్తుంది.

News November 1, 2024

పెరిగిన సిలిండర్ ధర

image

దీపావళి తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.61 మేర పెంచాయి. దీంతో ప్రస్తుతం HYDలో కమర్షియల్ LPG ధర రూ.2,028కి చేరింది. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.

News November 1, 2024

111 ఏళ్ల బీజేపీ కార్యకర్త మృతి

image

UPకి చెందిన ఓల్డెస్ట్ BJP కార్యకర్త శ్రీ నారాయణ్(111) అలియాస్ బులాయ్ భాయ్ కన్నుమూశారు. దీంతో ఆ పార్టీ నేతలు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జన సంఘ్ నేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో ఆయన 1974లో రాజకీయాల్లోకి వచ్చారు. నౌరంగియా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీ సేవకుడిగా కొనసాగుతున్నారు. కొవిడ్ టైమ్‌లో ప్రధాని మోదీ పరామర్శతో ఆయన వెలుగులోకి వచ్చారు.