News May 13, 2024

మరో 3 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

image

ఏపీలోని మరో 3 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ పూర్తయింది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ముగియనుంది.

Similar News

News April 2, 2026

సల్మాన్ – వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి?

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లోని మూవీపై ఆసక్తికర అప్‌డేట్స్ వచ్చాయి. ఇందులో సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఓ పాజిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. ఓ పవర్‌ఫుల్ యాక్షన్ క్యామియోకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ను సంప్రదించినట్లు టాక్. ఇక విలన్ పాత్రకు ఓ టాప్ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని మూవీ టీమ్ భావిస్తోందట. ఇదే జరిగితే సినిమాపై అంచనాలు భారీగా పెరగనున్నాయి.

News April 2, 2026

రూపీ సూపర్ రికవరీ

image

ఇటీవల ఒక డాలరుకు ₹95.12కు చేరి ఆల్ టైమ్ <<19515449>>కనిష్ఠాన్ని<<>> నమోదు చేసిన రూపాయి విలువ క్రమంగా కోలుకుంటోంది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో భారీ రికవరీ నమోదు చేసింది. ఒక డాలరుకు 93.48గా ఉన్న రూపాయి విలువ ఏకంగా 88 పైసలు పెరిగి 92.60కు చేరింది. యుద్ధం ఆగే సూచనలు, మార్కెట్లు నిన్న సానుకూలంగా ఉండటం రూపాయి రికవరీకి కలిసొచ్చింది.

News April 2, 2026

స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం, డిప్యూటీ సీఎం బిజీబిజీ

image

TG: ఈనెల 9న పుదుచ్చేరి, కేరళం, అస్సాం రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా బిజీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేరళంలో పర్యటిస్తుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు, రేపు పుదుచ్చేరిలో పర్యటిస్తారు. ఆ తర్వాత ఈనెల 4న కేరళంలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సైతం కేరళంలో ప్రచారంలో పాల్గొన్నారు. <<-se>>#Elections2026<<>>