News May 14, 2024
ఏపీలో పోలింగ్ ఇలా..

ఏపీలో నిన్న అర్ధరాత్రి వరకు 78.25శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. అత్యధికంగా అమలాపురం(SC) లోక్‌సభ స్థానానికి 83.19శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా విశాఖపట్నంలో 68% శాతం ఓటింగ్ జరిగింది. మరోవైపు అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా ధర్మవరంలో 88.61%, అత్యల్పంగా పాడేరులో 55.45% పోలింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం కల్లా ఈసీ పూర్తి వివరాలు వెల్లడించనుంది.
Similar News
News March 3, 2026
తమ్మినేనిపై సీపీఎం అభిశంసన

TG: CPM సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ అభిశంసింది. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో లాబీయింగ్, ప్రలోభాలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంది. ఇది రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలడానికి దారితీసిందని ఆగ్రహించింది. తమ్మినేనితో పాటు కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, వారిచ్చిన వివరణల్లోనూ ఆత్మవిమర్శ లోపించిందంటూ అభిశంసన చర్యలు చేపట్టింది.
News March 3, 2026
ఈ ప్రధాన పంటలకు ఈ ఎర పంటలతో మేలు

☛ వరి చుట్టూ జీలుగ వేసి కాండం తొలిచే పురుగు ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ మొక్కజొన్న చుట్టూ జొన్న మొక్కలను నాటి మొవ్వు ఈగ, కాండం తొలిచే పురుగును కట్టడి చేయొచ్చు. ☛ చెరకు పంట చుట్టూ కుంకుమ బంతి, సోయా చిక్కుడు వేసి నులి పురుగులను నివారించవచ్చు. ☛ పొగాకు చుట్టూ ఆముదం పంట వేసి పొగాకు లద్దె పురుగులను నియంత్రించవచ్చు. ☛ మిరప చుట్టూ ఆముదం పంట వేసి కాయతొలుచు పురుగులను కట్టడి చేయొచ్చు.
News March 3, 2026
ఏఐ కల్పిత తీర్పులపై సుప్రీంకోర్టు హెచ్చరిక

ఏఐ కల్పిత తీర్పులపై అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వాటి వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని ఓ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో అసలు ఉనికిలోనే లేని కేసు లాస్‌ను ప్రస్తావించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిని సీరియస్‌గా తీసుకుంది.


