News March 28, 2024
ముగిసిన పోలింగ్

TG: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Similar News
News January 29, 2026
పాడేరు: రేపు మీకోసం కార్యక్రమం రద్దు

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రతీ శుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీ శుక్రవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో మీకోసం కార్యక్రమం రద్దు చేశామన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, మీకోసం కార్యక్రమానికి పాడేరు ఎవరూ రావద్దని సూచించారు.
News January 29, 2026
‘ఫేర్వెల్ సాంగ్’.. నా మరణానంతరమే రిలీజ్: జాకీ చాన్

కుంగ్ ఫూ స్టార్ జాకీ చాన్ తన అభిమానులతో ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. తన మరణం తర్వాతే విడుదల చేయాలని ఒక ప్రత్యేక పాట రికార్డ్ చేయించుకున్నట్లు తెలిపారు. బీజింగ్లో జరిగిన తన కొత్త సినిమా వేడుకలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ పాట ప్రపంచానికి తానిచ్చే చివరి సందేశమని ఆయన తెలిపారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో భద్రపరిచి, అభిమానులకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
News January 29, 2026
నేతన్నలకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీమ్

AP: మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. హ్యాండ్లూమ్ (మగ్గం)కు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ద్వారా 4 లక్షల మందికి లాభం కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు. దీనివల్ల నెలకు రూ.85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. 50 ఏళ్లకే నేతన్నలకు రూ.4 వేల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.


