News May 25, 2024

ముగిసిన పోలింగ్

image

దేశంలో ఆరో విడత పోలింగ్ ముగిసింది. 58 స్థానాల్లో 889మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు EVMలలో నిక్షిప్తం చేశారు. 6 గంటలకు ముందు క్యూలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం ఇస్తున్నారు. యూపీలో 14, ప.బెంగాల్‌లో 8, హరియాణాలో 10, ఢిల్లీలో 7, బిహార్‌లో 8, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 4, జమ్మూలో ఒక లోక్‌సభ స్థానానికి, ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

Similar News

News December 7, 2025

అర్ధరాత్రి తినే అలవాటు ఎంత ప్రమాదమంటే?

image

అర్ధరాత్రి తినే అలవాటు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లేట్ నైట్ తినే అలవాటు మీ నిద్ర, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రాత్రి సమయంలో మీ శరీరం ఫ్యాట్‌ని బర్న్ చేస్తుంది. కానీ, మీరు తినడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కాస్తా స్టోరేజ్ మోడ్‌కు వెళ్తుంది. దాంతో మీ శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని చెబుతున్నారు.

News December 7, 2025

న్యాయం చేయండి.. మోదీకి పాక్ మహిళ అభ్యర్థన

image

తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని పాకిస్థాన్ మహిళ కోరారు. తన భర్త విక్రమ్ నాగ్‌దేవ్ కరాచీ నుంచి లాంగ్ టర్మ్ వీసాపై ఇండోర్‌(MP) వచ్చి అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. అతను ఢిల్లీకి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలిసిందని చెప్పారు. జనవరిలో కేసు ఫైల్ చేసినా లీగల్‌గా న్యాయం జరగలేదన్నారు. ప్రధాని మోదీ న్యాయం చేయాలంటూ అభ్యర్థించిన వీడియో వైరలవుతోంది. దీనిపై లీగల్ బాడీస్ మండిపడుతున్నాయి.

News December 7, 2025

‘EU’ని రద్దు చేయాలి: ఎలాన్ మస్క్

image

యూరోపియన్ కమిషన్ ‘X’కు 140 మిలియన్ డాలర్ల <<18483215>>ఫైన్<<>> విధించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘యూరోపియన్ యూనియన్‌ను రద్దు చేయాలి. సార్వభౌమాధికారాన్ని దేశాలకు తిరిగి ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వాలు తమ ప్రజలకు బాగా ప్రాతినిధ్యం వహించగలుగుతాయి’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌ను ఓ యూజర్ షేర్ చేయగా.. ‘నా ఉద్దేశం అదే.. నేను తమాషా చేయట్లేదు’ అని పునరుద్ఘాటించారు.