News November 20, 2024

మహారాష్ట్రలో ముగిసిన పోలింగ్.. కాసేపట్లో WAY2NEWSలో ఎగ్జిట్ పోల్స్

image

మహారాష్ట్రలో పోలింగ్ ముగిసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 58శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఈనెల 23న ఫలితాలు వెలువడతాయి. ఎగ్జిట్ పోల్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా WAY2NEWS యాప్‌లో చూడండి.

Similar News

News December 4, 2025

నవోదయ పరీక్షకు 28 కేంద్రాలు: పూర్ణిమ

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న జరిగే జవహర్ నవోదయ విద్యాలయ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు 5648 మంది విద్యార్థులు హాజరు అవుతారని వెల్లడించారు. www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ పొందాలని సూచించారు. వివరాలకు 9110782213 హెల్ప్ లైన్లో సంప్రదించాలన్నారు.

News December 4, 2025

సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

image

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.

News December 4, 2025

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

image

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్‌ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.