News May 15, 2024
ఏపీలో ప్రముఖుల నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం..

➢YS జగన్- పులివెందుల: 81.34%, చంద్రబాబు – కుప్పం: 85.87%,
➢పవన్ కళ్యాణ్- పిఠాపురం: 86.63%
➢నారా లోకేశ్- మంగళగిరి: 85.74%
➢బాలకృష్ణ- హిందూపురం: 77.82%
➢షర్మిల, అవినాశ్ రెడ్డి- కడప పార్లమెంట్: 78.73%
Similar News
News February 2, 2026
విజయ్-రష్మిక పెళ్లి ఆ రోజే: TOI

విజయ్ దేవరకొండ-రష్మిక <<19017838>>పెళ్లి<<>> ఇవాళ అంటూ సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా(TOI) కథనం పేర్కొంది. అటు పెళ్లిపై రష్మిక గానీ విజయ్ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కాగా వీరిద్దరు ‘రణబాలి’ సినిమాలో నటిస్తున్నారు.
News February 2, 2026
అట్లీతో వరుణ్ తేజ్ మూవీ?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అట్లీ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్‌తో పనిచేసేందుకు అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఓ పవర్‌ఫుల్ కమర్షియల్ యాక్షన్ కథను సిద్ధం చేశారనే టాక్‌తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News February 2, 2026
వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.


