News April 27, 2024

పోలింగ్ స్టేషన్ ధ్వంసం.. ఈ నెల 29న రీపోలింగ్‌

image

కర్ణాటకలోని హనూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఓ పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇండిగనత్త గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేవని గ్రామస్థులు అధికారులను నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ స్టేషన్‌లోని ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో ఈ నెల 29న ఆ గ్రామంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు EC ప్రకటించింది.

Similar News

News November 19, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

☞ 100 టెస్టులు ఆడిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా ముష్ఫికర్ రహీమ్ రికార్డు
☞ పార్ట్ టైమ్ ఆల్‌రౌండర్లను టెస్టుల్లోకి తీసుకోవద్దు.. లేదంటే భారత్ WTC ఫైనల్‌కు చేరడం కష్టం: సునీల్ గవాస్కర్
☞ డెఫ్‌లింపిక్స్‌లో భారత షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు రెండో గోల్డ్ మెడల్.. ఇటీవల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన శ్రీకాంత్, 10m మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ గోల్డ్ గెలిచాడు

News November 19, 2025

పుట్టపర్తికి మోదీ… స్వాగతం పలికిన సీఎం

image

AP: శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయానికి చేరుకుని బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. కాసేపట్లో బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేస్తారు.

News November 19, 2025

రాగి వస్తువులు ఇలా శుభ్రం..

image

ఇటీవలి కాలంలో రాగి పాత్రల వాడకం ఎక్కువైంది. వీటిని శుభ్రం చేయడం పెద్ద టాస్క్. దాని కోసం కొన్ని టిప్స్. శనగపిండి, పెరుగు, ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో రాగి పాత్రలను రుద్దితే మెరిసిపోతాయి. చెంచా ఉప్పుకి, రెండు చెంచాల వెనిగర్ కలిపి ఆ మిశ్రమంతో ఈ వస్తువులను తోమండి. మునుపటిలా తిరిగి తళతళలాడటం మీరే గమనిస్తారు. అలాగే నిమ్మరసం, ఉప్పు, బేకింగ్ సోడా కలిపి తోమినా కొత్తవాటిలా కనిపిస్తాయి.