News March 28, 2024

ఆఫ్రికా వలసదారుల కోసం పోలింగ్ కేంద్రాలు

image

తూర్పు ఆఫ్రికా నుంచి 14-17 శతాబ్దాల్లో ‘సిద్దీలు’ అనే తెగకు చెందిన వారు మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో వీరు జంజీరా ద్వీపాన్ని పాలించారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, గుజరాత్‌లోని జఫ్రాబాద్, కఠియవాడ్ వీరి అధీనంలో ఉండేవి. వారి వారసుల్లో దాదాపు 3,500 మంది ఓటర్లున్నారు. వీరికోసం గుజరాత్‌ సోమనాథ్ జిల్లాని గిర్ అడవుల్లో అధికారులు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 25, 2026

చిన్న నియోజకవర్గం.. గొప్ప అభివృద్ధి

image

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. దీనివల్ల ఒక్కో MP పరిధిలోని జనాభా 30 లక్షల నుంచి 15 లక్షలకు తగ్గుతుంది. చిన్న నియోజకవర్గాల వల్ల MPలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తారు. ఫలితంగా స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు MP నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. ఈ మార్పు క్షేత్రస్థాయి అభివృద్ధికి, యువ నాయకత్వం రాజకీయాల్లోకి రావడానికి అవకాశంగా నిలుస్తుంది.

News March 25, 2026

అమెరికా-ఇరాన్ మధ్య పాక్.. వ్యూహమా? స్వార్థమా?

image

US, ఇరాన్ మధ్య గొడవను ఆపేందుకు పాక్ ఇప్పుడు మధ్యవర్తిగా మారుతోంది. దీని వెనుక శాంతి కంటే స్వార్థమే ఎక్కువ కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాలేక గల్ఫ్ దేశాల సపోర్ట్ కోసం ఇలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఇండియా ఇన్‌ఫ్లుయెన్స్‌ను తగ్గించాలనే వ్యూహమూ కనిపిస్తోందంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డైరెక్షన్‌లో జరుగుతున్న ఈ టాక్టిక్స్‌కు ఇరాన్ ఇంకా ఓకే చెప్పలేదు.

News March 25, 2026

రామ్ చరణ్‌కు గాయం?

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటికి గాయమైనట్లు తెలుస్తోంది. పెద్ది సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదమేమీ లేదని, రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు టాక్. చరణ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.