News April 28, 2024
పోలింగ్ సమయం పొడిగించాలి: కాంగ్రెస్ నేత

TG: వేసవి తీవ్రత దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని రాష్ట్రంలో పొడిగించాలని సీఈవో వికాస్ రాజ్‌ను పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు బదులుగా 6 గంటల వరకు పెంచాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వడగాలుల భయంతో ప్రజలు బయటకొచ్చేందుకు భయపడుతున్నారని తెలిపారు. మరోవైపు కొన్ని సెగ్మెంట్లలో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.
Similar News
News January 20, 2026
రేపే తొలి T20.. IND ప్లేయింగ్ 11 ఇదేనా?

IND రేపు NZతో నాగ్‌పూర్ వేదికగా తొలి T20 ఆడనుంది. ఇప్పటికే నం.3లో ఇషాన్ కిషన్ ఫిక్స్ కాగా ప్లేయింగ్ 11 ఇదేనంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలను Xలో పంచుకుంటున్నారు. త్వరలోనే T20 WC ఉండటంతో పెద్దగా ప్రయోగాలు చేయకుండా తొలి మ్యాచ్ ఆడే జట్టునే సిరీస్ మొత్తం కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. టీమ్: అభిషేక్, శాంసన్, కిషన్, సూర్య, హార్దిక్, దూబె, అక్షర్, రింకూ, కుల్దీప్/వరుణ్, అర్ష్‌దీప్, బుమ్రా.
News January 20, 2026
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

దావోస్ వేదికగా గూగుల్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో TG CM రేవంత్ భేటీ అయ్యారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌ల ప్రోత్సాహంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గూగుల్ ఆసక్తి చూపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి ఫార్ములాను రేవంత్ వివరించారు.
News January 20, 2026
భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం

<<18887766>>WEF<<>>లో ట్రంప్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఏడుగురు భారతీయ పారిశ్రామికవేత్తలు ఉండటం గమనార్హం. వీరిలో టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, భారతీ Airtel ఛైర్మన్ సునీల్ మిట్టల్, విప్రో CEO శ్రీనివాస్ పల్లియా, ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్ సంజీవ్, మహీంద్రా గ్రూప్ CEO అనీష్ షా, జూబిలెంట్ గ్రూప్ కో-ఛైర్మన్ భర్తియా ఉన్నారు. ఆరేళ్ల తర్వాత ట్రంప్ WEFలో పాల్గొంటున్నారు.


