News May 12, 2024
రేపే పోలింగ్.. WAY2NEWSలో వేగంగా అప్డేట్స్
రేపు నాలుగో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లు, తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో ప్రజలు ఓటు వేయనున్నారు. మొత్తంగా 10 రాష్ట్రాలు/UTల్లోని 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 6 నుంచి అన్ని ప్రాంతాల్లోని పోలింగ్ అప్డేట్స్ను WAY2NEWSలో వేగంగా తెలుసుకోవచ్చు. కచ్చితమైన సమాచారం అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఓటు వేయడానికి మీరు రెడీగా ఉన్నారా?
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 9, 2025
వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల
AP: పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రేపటి నుంచి మొదలుకానున్న నేపథ్యంలో భూలోక వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్కాంతుల ధగధగల మధ్య శ్రీవారి క్షేత్రం మెరిసిపోతోంది. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తజన గోవింద నామ స్మరణతో ఏడుకొండలు మారుమోగుతున్నాయి. రేపు వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమన్నారాయణుడి వైకుంఠ ద్వార దర్శనం ముక్తిని ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.
News January 9, 2025
రేపు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్.. వారికి పోలీసుల సూచనలు
TG: ‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో HYDలో ‘గేమ్ ఛేంజర్’ ప్రదర్శించే థియేటర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ చేశారు. రేపు ఆ సినిమా విడుదల సందర్భంగా నిబంధనలు పాటించాలని యజమానులను సూచించారు. థియేటర్ల వద్ద హడావుడి ఉండొద్దని, టికెట్ ఉన్న ప్రేక్షకులనే లోపలికి అనుమతించాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
News January 9, 2025
చర్చలు సఫలం.. యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవలు
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆస్పత్రులకు ఏడాది కాలంలో ప్రభుత్వం రూ.1100 కోట్లు చెల్లించిందని, గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ.730 కోట్లనూ చెల్లించినట్లు ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 2013 నుంచి పెండింగ్లో ఉన్న ప్యాకేజీల రేట్లనూ 22శాతం పెంచామని గుర్తు చేసింది.