News March 16, 2024
ఈ 3 రాష్ట్రాల్లో ఏడు విడతల్లో పోలింగ్

యూపీ, బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రాల విస్తీర్ణం, హింసాత్మక, మావో ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్లో 5 విడతలు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్లో నాలుగు విడతలు, ఛత్తీస్గఢ్, అస్సాంలో 3 విడతలు, కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్లో రెండు విడతలు, మిగతా 22 రాష్ట్రాలు/UTల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
Similar News
News January 25, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 25, 2026
ఇవాళ సూర్య జయంతి.. ‘రథ సప్తమి’ అని ఎందుకంటారు?

కశ్యప మహాముని కుమారుడు సూర్యుడి జయంతి నేడు. అయితే ‘రథ సప్తమి’గా ప్రాముఖ్యం చెందింది. దానికి కారణం.. ఇవాళ ఆదిత్యుడు 7గుర్రాల రథంపై దక్షిణాయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణిస్తాడని భక్తులు నమ్ముతారు. మాఘ సప్తమి(నేడు) నుంచి 6నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంత్రం విష్ణు స్వరూపంగా సూర్యుడు త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తారని విశ్వసిస్తారు.
News January 25, 2026
తిరుమల గిరుల్లో రథసప్తమి శోభ

AP: తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5:30 గంటలకే మలయప్ప స్వామి ఉభయ దేవతలతో కలిసి సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. శ్రీవారి నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


