News March 18, 2025
రేపటి నుంచి POLYCET దరఖాస్తుల స్వీకరణ

TG: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే POLYCET-2025 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచి ఏప్రిల్ 19 వరకు జరగనుంది. మే 13న ఎగ్జామ్ జరగనుండగా, పరీక్ష జరిగిన 12 రోజులకు ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.500గా ఉంది. సందేహాలకు 08031404549 నంబర్లో సంప్రదించండి.
వెబ్సైట్: https://polycet.sbtet.telangana.gov.in/
Similar News
News November 22, 2025
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో స్పష్టం చేసింది. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనుంది. ST రిజర్వేషన్లు ఖరారయ్యాక SC, BC రిజర్వేషన్లు ఉంటాయి. రేపు సా.6 గంటల్లోపు ఖరారు చేసిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించనున్నారు.
News November 22, 2025
ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

బీటెక్ చదివిన ప్రతి విద్యార్థినికి ఉద్యోగం రావాలని JNTU హైదరాబాద్ అధికారులు కొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొద్దిపాటి తేడాతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన విద్యార్థినులకు ఆరు నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేందుకు సాయం చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరులోని ఎమర్టెక్స్ అనే ఐటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. JNTUలో చదివితే ఉద్యోగం ఖాయం అనే ధీమాను కల్పిస్తున్నారు.
News November 22, 2025
IIITకల్యాణిలో నాన్ టీచింగ్ పోస్టులు

IIITకల్యాణి, పశ్చిమబెంగాల్లో 6 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, CA/ICWA, ME, M.Tech, MSc, MCA, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iiitkalyani.ac.in


