News June 3, 2024
కాసేపట్లో పాలిసెట్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

TG: పాలిసెట్ ఫలితాలు నేడు మ.12 గంటలకు విడుదల కానున్నాయి. https://sbtet.telangana.gov.in అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను ఒక్క క్లిక్‌తో షేర్ చేసుకోవచ్చు.
Similar News
News December 18, 2025
రోల్ బాల్ WC విజేతలుగా భారత జట్లు

దుబాయ్ వేదికగా జరిగిన రోల్ బాల్ వరల్డ్ కప్‌లో భారత మెన్స్, ఉమెన్స్ టీమ్స్ అదరగొట్టి ఛాంపియన్లుగా నిలిచాయి. కెన్యా జట్లతో జరిగిన ఫైనల్లో మహిళల జట్టు 3-2 తేడాతో, పురుషుల జట్టు 11-10 తేడాతో విజయం సాధించాయి. కాగా ఇది రోలర్ స్కేట్స్‌తో ఆడే ఒక గేమ్. బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, త్రోబాల్ కలయికలో ఉంటుంది. ఆటగాళ్లు స్కేట్స్ వేసుకొని బంతిని చేతులతో పాస్ చేసుకుంటూ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి వేయాలి.
News December 18, 2025
విడాకులు తీసుకున్నట్లు నటుడి ప్రకటన

17 ఏళ్ల వివాహ బంధానికి సీనియర్ నటుడు షిజు ఏఆర్ ముగింపు పలికారు. ‘ప్రీతికి, నాకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరయ్యాయి. ఇకపై ఇద్దరం స్నేహితులుగా ఉంటాం. మా ప్రైవసీకి భంగం కల్గించొద్దని కోరుతున్నా’ అని సోషల్ మీడియాలో తెలిపారు. మాలీవుడ్ పాపులర్ నటుల్లో ఒకరైన షిజు తెలుగులో ‘దేవి’తో పరిచయమై ‘సింహరాశి, మనసంతా నువ్వే, గౌతమ్ SSC, నువ్వు నాకు నచ్చావ్, శతమానం భవతి, రాబిన్ హుడ్’ తదితర సినిమాల్లో నటించారు.
News December 18, 2025
జోగి రమేశ్‌కు చుక్కెదురు

AP: నకిలీ మద్యం కేసు నిందితుడు (A18) జోగి రమేష్ బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. ఆయనతో పాటు A19 జోగి రాములు, A2జగన్మోహన్ రావులకూ కోర్టు ఈనెల 31 వరకు రిమాండ్ విధించడంతో వారిని పోలీసులు తిరిగి జైలుకు తరలించారు. ఇక ఈ కేసులోని మరో ఏడుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. అటు నెల్లూరు జైలు నుంచి విజయవాడ జైలుకు తరలించాలన్న జోగి బ్రదర్స్ వినతిని న్యాయస్థానం ఆమోదించింది.


