News July 26, 2024
నేటి నుంచి పాలిసెట్ స్పెషల్ అడ్మిషన్స్

TG: పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరాలనుకునే విద్యార్థులకు నేటి నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు నిర్వహిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. ఇందుకు ఈరోజు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. 27న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అదే రోజు ప్రారంభమవుతుందని తెలిపారు. 28న కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 31న సీట్లు కేటాయిస్తారు. AUG 2న సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.
Similar News
News January 15, 2026
కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.
News January 15, 2026
దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్లో గుర్తుచేశారు.
News January 15, 2026
NTVపై చర్యలకు కారణం ఇదేనా?

TG: మంత్రి, ఓ మహిళా IAS అధికారికి సంబంధం ఉందని <<18856335>>NTV<<>>, పలు యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తతో సివిల్ సర్వీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా హోదాలు చెప్పి పరోక్షంగా ఆమె పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదు చేసింది. ఆ వార్తను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేయడంతో సర్కారు.. సిట్ ఏర్పాటు చేసి యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు ఇచ్చింది. NTV రిపోర్టర్లను అరెస్టు చేసింది.


