News May 23, 2024

రేపే పాలిసెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

image

TG: రేపు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఉ.11 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమై మ.1.30 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 259 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. గంట ముందు నుంచే అనుమతి ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. విద్యార్థులు హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఎరేస‌ర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకెళ్లాలి. పరీక్షకు 92,808 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Similar News

News December 12, 2025

ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పెద్దలతో భేటీకానున్నారు. 18న సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నారు. అదేరోజు రాత్రి పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఆమోదాలు, అనుమతులపై చర్చించే అవకాశం ఉంది. 19న సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరనున్నారు.

News December 12, 2025

రెండో విడత ప్రచారానికి తెర

image

TGలో రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12 వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పోలింగ్‌కు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.

News December 12, 2025

‘అఖండ-2’ సీక్వెల్ ఉంటుందా?

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజవ్వగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఎండ్ కార్డ్‌లో ‘జై అఖండ’ అనే టైటిల్ పోస్టర్ ఇవ్వడంతో సీక్వెల్‌పై చర్చ మొదలైంది. కాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న ‘నెట్‌ఫ్లిక్స్’లో త్వరలో ‘అఖండ-2’ స్ట్రీమింగ్ కానుంది. మూవీ చూసిన వారు ఎలా ఉందో కామెంట్ చేయండి.