News August 1, 2024
పోలీసు భద్రతకు పొన్నవోలు అనర్హులు: హైకోర్టు

AP: పోలీసు భద్రత పొందేందుకు మాజీ AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనర్హులని హైకోర్టు తేల్చింది. రాజ్యాంగ, చట్టబద్ధ పదవులు నిర్వహించనందున సెక్యూరిటీకి అనర్హులని పేర్కొంది. ఆయనకు ప్రాణహాని లేదని ఇప్పటికే సెక్యూరిటీ రివ్యూ కమిటీ తేల్చిందని గుర్తు చేసింది. కమిటీ నివేదికపై అభ్యంతరాలుంటే సవాల్ చేసుకోవాలంది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై నమోదైన స్కిల్, తదితర కేసులను ప్రభుత్వం తరఫున పొన్నవోలు వాదించారు.
Similar News
News March 27, 2026
‘థాంక్యూ ఇండియా’ అని మిస్సైల్‌పై రాసి..

ఇజ్రాయెల్, అమెరికా దాడులకు మిస్సైళ్లతోనే ఇరాన్ సమాధానమిస్తోంది. ఈ క్రమంలో తమకు సంఘీభావం తెలిపిన దేశాలకు వినూత్నంగా కృతజ్ఞతలు చెబుతోంది. ‘థాంక్యూ జర్మన్ పీపుల్. థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’ అంటూ క్షిపణులపై సందేశాలు రాసి మరీ ప్రయోగిస్తోంది. స్పెయిన్, పాక్‌కూ ఇలానే థాంక్స్ చెప్పినట్లు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని US బేస్‌లపై ఈ దాడులు చేసినట్లు IRGC తెలిపింది.
News March 27, 2026
ఈ క్వాలిటీస్ ఉన్న మహిళలను పురుషులు ఇష్టపడతారు!

మహిళల్లోని కొన్ని క్వాలిటీలు పురుషులను ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు. ‘ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిని ఇష్టపడతారు. ఇండిపెండెంట్‌గా, దయతో ఉండే వారు నచ్చుతారు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పగల, తమ తప్పును ఒప్పుకోగల వారికి అట్రాక్ట్ అవుతారు. తమకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని, తాము కలగన్న వాటిని సాధించుకోవాలనుకునే వారిని పురుషులు లైక్ చేస్తారు’ అని చెబుతున్నారు.
News March 27, 2026
కాసేపట్లో మోదీ మీటింగ్.. ఏం జరగనుంది?

PM మోదీ సా.6.30 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై చూపుతున్న ప్రభావంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లై సన్నద్ధతపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవే కాకుండా మోదీ వేరే అంశాలపై ఏమైనా కీలక ఆదేశాలు/ప్రకటన ఇస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దేశంలో <<19488586>>లాక్‌డౌన్<<>> ప్రచారాన్ని కేంద్రం ఇప్పటికే ఖండించింది.


