News September 6, 2024
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పొన్నవోలు సుధాకర్
AP: వైసీపీ రెండు జిల్లాలకు అధ్యక్షులతో పాటు కీలక విభాగాలకు నియామకాలు చేపట్టింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా(లీగల్ వ్యవహారాలు) మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణమూర్తి, పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాలకు రాంభూపాల్ రెడ్డిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Similar News
News January 15, 2025
Stock Markets: మెటల్, PSU బ్యాంకు షేర్లకు గిరాకీ
మోస్తరు లాభాల్లో మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,202 (+25), సెన్సెక్స్ 76,649 (+150) వద్ద ట్రేడవుతున్నాయి. సెక్టోరల్ ఇండైసెస్ మిశ్రమంగా ఉన్నాయి. మెటల్, PSU BANK, ఆటో, O&G షేర్లకు డిమాండ్ ఉంది. FMCG, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. NTPC, మారుతీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ADANI SEZ టాప్ గెయినర్స్. BAJAJ TWINS టాప్ లూజర్స్.
News January 15, 2025
అరవింద్ కేజ్రీవాల్‌కు ముప్పు: ఇంటెలిజెన్స్ సోర్సెస్
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను అలర్ట్ చేసినట్టు సమాచారం. ఖలిస్థానీ వేర్పాటువాదుల నుంచి ఆయనకు ముప్పు ఉందని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అటు ఆప్, ఇటు కేంద్రం అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కేజ్రీవాల్‌కు Z-కేటగిరీ సెక్యూరిటీ ఉంది. నేడు హనుమాన్ మందిరంలో పూజలు చేశాక ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు.
News January 15, 2025
మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్, ఆయన సతీమణి రెబెకా ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తమకు బాబు పుట్టబోతున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో లబుషేన్ పోస్ట్ పెట్టారు. ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అని పేర్కొన్నారు. లబుషేన్, రెబెకాకు 2017 వివాహం జరగగా, 2022లో కూతురు హాలీ జన్మించింది.