News September 18, 2024

పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా పాంటింగ్?

image

IPLలో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నియమితులయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ఆ జట్టు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారని cricbuzz వెల్లడించింది. 2018 నుంచి పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా పని చేశారు. 2019, 20, 21లో ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు వెళ్లింది.

Similar News

News September 8, 2025

మాతా, శిశు వైద్యసేవలు విస్తరిస్తున్నాం: మంత్రి సత్యకుమార్

image

AP: ప్రభుత్వాస్పత్రుల్లో మాతా, శిశు వైద్య సేవలను విస్తరిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. గుంటూరు, కాకినాడ GGHలలో 500 చొప్పున పడకలతో 2 బ్లాకులు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆయా చోట్ల రూ.51కోట్లతో వైద్య పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కొత్త బ్లాకుల కోసం ICU బెడ్లు, పేషెంట్ మానిట‌ర్లు, వెంటిలేట‌ర్లు, మొబైల్ అల్ట్రా సౌండ్ మెషీన్లు తదితరాలు భారీ స్థాయిలో కొనుగోలు చేయ‌నున్నారు.

News September 8, 2025

బిగ్‌బాస్ సీజన్-9 కంటెస్టెంట్లు వీరే..

image

బిగ్‌బాస్ సీజన్-9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీ కోటాలో తనూజ(ముద్ద మందారం), నటి ఆశా సైనీ, కమెడియన్లు సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రఫర్ శ్రష్ఠి వర్మ, సీరియల్ నటుడు భరణి శంకర్, రీతూ చౌదరీ, నటి సంజనా గల్రానీ, ఫోక్ డాన్సర్ రాము రాథోడ్, సామాన్యుల నుంచి సోల్జర్ పవన్, మాస్క్ మ్యాన్ హరీశ్, డిమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మనీశ్‌ లోనికి వెళ్లారు.

News September 8, 2025

గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కన్నుమూత

image

నిర్మాత అల్లు అరవింద్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు(76) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం నాగరాజు అంత్యక్రియలు HYDలో జరిగాయి. అంతకుముందు దర్శకుడు రవిరాజా పినిశెట్టి, బన్నీ వాసు, బండ్ల గణేశ్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు. కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే.