News October 2, 2024
‘దళపతి 69’లో పూజా హెగ్డే

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా హెచ్ వినోద్ తెరకెక్కించనున్న ‘దళపతి 69’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ దీనికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘బీస్ట్’ మూవీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి అనిరుధ్ మ్యూజిక్ అందించనుండగా వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.
Similar News
News October 30, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు

మొంథా తుఫాను తెలంగాణపై విరుచుకుపడుతోంది. కుండపోత వర్షాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇవాళ సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. అటు ఏపీలోని విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి(ప్రైమరీ స్కూల్స్) జిల్లాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చారు. మరి మీ జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు ఉందా? COMMENT
News October 30, 2025
టారిఫ్ల తగ్గింపు కోసం USకు 350B డాలర్లు చెల్లించనున్న ద.కొరియా

టారిఫ్ల తగ్గింపు కోసం తమకు 350B డాలర్లు చెల్లించేందుకు ద.కొరియా ఒప్పుకుందని US ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ జరిగిందన్నారు. US నుంచి ఆయిల్, గ్యాస్ను భారీ మొత్తంలో కొనేందుకు కూడా ద.కొరియా అంగీకరించిందని తెలిపారు. ఆ దేశ కంపెనీలు USలో పెట్టే పెట్టుబడుల విలువ $600Bను మించిపోతుందన్నారు. అణుశక్తితో నడిచే జలాంతర్గామి నిర్మాణానికి వారికి అనుమతినిచ్చినట్లు చెప్పారు.
News October 30, 2025
532 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO)లో 532 అప్రెంటిస్లకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ పాసై 20- 28ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. మొత్తం పోస్టుల్లో APలో 7, TGలో 8 ఖాళీలున్నాయి. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. వెబ్సైట్: uco.bank.in/


