News February 2, 2025

విలేకరిపై పూజా హెగ్డే ఆగ్రహం

image

‘దేవా’ మూవీ ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరిపై నటి పూజా హెగ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సల్మాన్, హృతిక్, రణ్‌వీర్, షాహిద్ వంటివారి సరసన అవకాశాలు రావడం మీ లక్ అనుకుంటున్నారా? అందుకు మీకు అర్హత ఉందని భావిస్తున్నారా? పెద్ద హీరోల్ని చూసి సినిమాలు సెలక్ట్ చేసుకుంటారా?’ అంటూ విలేకరి అడిగిన ప్రశ్నల పట్ల ఆమె మండిపడ్డారు. నాతో మీ సమస్యేంటి అని ప్రశ్నించారు. వెంటనే హీరో షాహిద్ కలుగజేసుకుని ఆమెను శాంతింపజేశారు.

Similar News

News January 19, 2026

వేమన గొప్ప దార్శనికుడు: కడప ఎస్పీ

image

యోగి వేమన గొప్ప సంఘసంస్కర్త, దార్శనికుడు అని కడప ఎస్పీ నచి కేత్ కొనియాడారు. యోగి వేమన జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. 350 సంవత్సరాల క్రితమే సమాజంలోని మూఢనమ్మకాల నిర్మూలించేందుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

News January 19, 2026

మళ్లీ ఇండియాకు రాను: విదేశీయురాలు

image

ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికన్ మహిళకు ఢిల్లీ మెట్రోలో చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీ సాకుతో వచ్చిన ఓ టీనేజ్ బాలుడు ఆమె బ్రెస్ట్‌ను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణాన్ని అబ్బాయి తల్లి వెనకేసుకొస్తూ అది ‘ఓవర్ యాక్షన్’ అని కొట్టిపారేయడం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ‘ఇకపై భారత్‌కు, దక్షిణాసియాకే రాను’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉంది.

News January 19, 2026

స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టండిలా!

image

డెలివరీ అయిన తర్వాత చాలామంది మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. వీటిని ఎలా తొలగించుకోవాలంటే.. * ఆముదం నూనెను స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, 15నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత హీటింగ్ ప్యాడ్‌ను ఆ మార్క్స్‌పై 10 నిమిషాలు ఉంచాలి. ఇలా నెలరోజులు చెయ్యాలి. * కలబంద గుజ్జును స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, మూడు గంటల పాటు వదిలేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేయాలి.