News July 19, 2024
పూజా ఖేడ్కర్‌పై యూపీఎస్సీ చర్యలు

మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌పై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయవద్దో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు పంపింది. యూపీఎస్సీకి నకిలీ ఐడెంటిటీ సమర్పించి ఉద్యోగం సాధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఆమె యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా ఆంక్షలు విధించింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News January 19, 2026
పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టులో విచారణ

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై PC ఘోష్ కమిషన్ నివేదికపై KCR, హరీశ్, స్మితా సబర్వాల్, SK జోషి దాఖలు చేసిన పిటిషన్లను HC విచారించింది. కేసీఆర్, హరీశ్ తరఫున అడ్వకేట్ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై పిటిషనర్లు రిప్లై ఫైల్ చేశారు. దీనిపై ప్రభుత్వం రిప్లై ఇవ్వడానికి టైమ్ కావాలని AG కోరారు. FEB 20లోపు లిఖితపూర్వకంగా ఇవ్వాలంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు కోర్టు వాయిదా వేసింది.
News January 19, 2026
మాఘ గుప్త నవరాత్రుల గురించి మీకు తెలుసా?

మాఘమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులను ‘మాఘ గుప్త నవరాత్రులు’ అంటారు. అయితే, ఇవి రహస్యంగా (గుప్తంగా) అమ్మవారిని ఉపాసించేవి. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. ఈ సమయంలో శక్తి స్వరూపిణి అయిన వారాహి దేవిని, దశమహావిద్యలను భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా సాధకులు ఆధ్యాత్మిక శక్తి కోసం, ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలగడం కోసం ఈ నవరాత్రులలో కఠిన నియమాలతో పూజలు నిర్వహిస్తారు.
News January 19, 2026
రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 31 ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://skltghu.ac.in/


