News September 21, 2025
మండోదరి పాత్రలో పూనమ్.. వ్యతిరేకిస్తున్న BJP, VHP!

ఢిల్లీలో జరిగే ‘రామ్‌లీల’ ఈవెంట్‌లో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించేందుకు పూనమ్ పాండేను తీసుకోవడంపై స్థానిక BJP, VHP నేతలు అభ్యంతరం తెలిపారు. ఆమెను మరొకరితో రీప్లేస్ చేయాలని లవ్‌కుశ్ రామ్‌లీల కమిటీని కోరారు. పూనమ్ తన ఫొటోలు, వీడియోలతో ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేశారని గుర్తుచేశారు. అయితే ఇందులో తమకు ఏ తప్పూ కనిపించలేదని, ప్రతి ఒక్కరూ అవకాశం పొందేందుకు అర్హులని కమిటీ ప్రెసిడెంట్ బదులిచ్చారు.
Similar News
News September 21, 2025
సా.5 గంటలకు మోదీ ప్రసంగం

ఈ సాయంత్రం 5 గం.కు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని ఏం చెబుతారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో దానిపై ఏదైనా ప్రకటన చేస్తారా? లేదా అమెరికా H1B వీసాలపై మాట్లాడతారా? అనేది చూడాలి.
News September 21, 2025
పాడి పశువుల్లో కురమ జ్వరంతో నష్టాలు

పశువులకు అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వర్షాకాలంలో బలిష్టమైన ఆంబోతులు, ఎద్దులు, ఆవులకు కురమ జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి పశువులో 3 రోజులు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ.. ఈ సమయంలో పశువులు బాగా నీరసించిపోతాయి. పాల దిగుబడి దాదాపు 80% వరకు తగ్గిపోతుంది. కురమ జ్వరం లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెటర్నరీ నిపుణులు రాంబాబు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.
News September 21, 2025
పాడి పశువుల్లో కురమ జ్వరం లక్షణాలు

వైరల్ ఫీవర్ కురమ సోకితే పశువు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. కాళ్లు పట్టేయడం, పడుకొని లేవలేకపోవటం, కదలకుండా ఉండటం వంటి లక్షణాలు పశువుల్లో కనిపిస్తాయి. దీంతో పాటు పశువుల్లో వణుకు, చెవులు వాలేసి ఉండటం, గురక పెట్టడం, పళ్లు నూరడం, నెమరు వేయకపోవటం, ఆకలి లేకపోవటం, మూలగడం, గొంతు నొప్పి, చొంగ పడటం, కుంటడం, కీళ్ల నొప్పులతో పాటు కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ముక్కు, కళ్ల నుంచి నీరు వస్తుంది.