News April 12, 2024
మూడు పెళ్లిళ్లు అంటూ పూనమ్ కౌర్ కౌంటర్

వైసీపీ నేత ట్వీట్‌కు నటి పూనమ్ కౌర్ ఇచ్చిన కౌంటర్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ప్రదీప్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు ‘నేను టెస్లా కారు వాడుతున్నా. ట్విటర్‌లోనూ యాక్టివ్‌గా ఉంటా. ఈ రెండూ నా జీవితంలో భాగం. ఏపీలో టెస్లా బ్రాంచ్ పెట్టండి’ అంటూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. దీనిని రీట్వీట్ చేసిన పూనమ్ కౌర్ ‘అతడికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. అయినా పర్వాలేదా’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
Similar News
News March 10, 2026
ఈ ఇద్దరు MPలు జీతాలు తీసుకోవట్లే!

ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా చాలామంది పార్లమెంటేరియన్లు జీతాలు వదులుకునేందుకు ఇష్టపడట్లేదు. ప్రస్తుతం 18వ లోక్‌సభలో మొత్తం 543 మందిలో కేవలం ఇద్దరే జీతభత్యాలు తీసుకోవట్లేదని RTI ద్వారా తెలిసింది. హరియాణా BJP MP నవీన్ జిందాల్ జీతంతో పాటు అన్ని అలవెన్సులను వదులుకోగా కాంగ్రెస్ MP అంగోమ్చా బిమోల్ అకోయిజామ్(మణిపుర్) తన వేతనాన్ని నిరాకరించారు. పదవి ప్రజాసేవకే తప్ప సంపాదనకు కాదు అని వీరు నిరూపించారు.
News March 10, 2026
ఫైనల్లో గొడవ.. అర్ష్‌దీప్‌కు ICC ఫైన్

T20 WC ఫైనల్లో కివీస్ బ్యాటర్ మిచెల్‌పైకి బంతి విసిరిన ఘటనలో భారత బౌలర్ అర్ష్‌దీప్‌పై ICC చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అర్ష్‌దీప్ ICC ప్రవర్తనా నియమావళి లెవెల్-1 ఉల్లంఘించారని పేర్కొంది. కాగా ఫైనల్ మ్యాచులో మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా అర్ష్‌దీప్ బంతి అందుకొని అతడిపైకి విసిరేయడంతో <<19332640>>గొడవ<<>> జరిగింది. తర్వాత మిచెల్‌కు అర్ష్‌దీప్ క్షమాపణ చెప్పారు.
News March 10, 2026
FDI రూల్స్ సడలించిన కేంద్రం

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2020లో తెచ్చిన రూల్స్‌ను సవరించినట్లు తెలుస్తోంది. పాత రూల్‌లో చైనా సహా భారత్‌తో సరిహద్దు పంచుకున్న దేశాల సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే కేంద్రం అనుమతి ఉండాల్సిందే. ఇతర విదేశీ సంస్థలైనా సరే వాటిలో ఈ దేశాల వాటా ఉంటే ఈ రూల్ వర్తిస్తుంది. చైనాతో ఉద్రిక్తతలు, దేశ భద్రత దృష్ట్యా గతంలో ఈ నిబంధన తెచ్చింది. తాజాగా ఈ నిబంధన మార్చింది.


