News December 27, 2024
సీఎం-సినీ ప్రముఖుల భేటీపై పూనమ్ కౌర్ ట్వీట్

సీఎం రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖుల భేటీపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘ఈ మీటింగ్‌ను చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. హీరోలకు ఏవైనా వ్యాపార సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుంది’ అని ఆమె సెటైర్ వేశారు. ఇవాళ సీఎంతో జరిగిన భేటీలో ఇండస్ట్రీ నుంచి ఒక్క నటి కానీ మహిళా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కానీ ఎవరూ పాల్గొనలేదు. దీనిని ఉద్దేశించే ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News February 9, 2026
ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.
News February 9, 2026
దీపారాధనలో ఏ నూనె వాడాలంటే?

దీపారాధనలో మనం వాడే నూనెను బట్టి ఆయా దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. మహాలక్ష్మికి ఆవు నెయ్యి అత్యంత ప్రీతికరమైనది. దీనివల్ల ఐశ్వర్యం, సాత్విక గుణం పెరుగుతాయి. విష్ణుమూర్తికి, శని దేవునికి, సుబ్రహ్మణ్య స్వామికి నువ్వుల నూనె ప్రీతికరం. గణపతికి కొబ్బరి నూనె ఇష్టమైనది. అమ్మవార్లకు ఆముదం/వేప నూనె ఉపయోగిస్తారు. శనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడకూడదు. తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
News February 9, 2026
కోహ్లీVsగంభీర్ ప్రచారంపై BCCI సెక్రటరీ ఏమన్నారంటే?

విరాట్ కోహ్లీ-కోచ్ గంభీర్ మధ్య గొడవలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ కార్యదర్శి సైకియా ఖండించారు. వారిద్దరికి ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. వారిద్దరి మధ్య మంచి సంబంధం ఉందని చెప్పారు. టెస్టులకు రిటైర్మెంట్ విషయంలో కోహ్లీని ఎవరూ బలవంతం చేయలేదని తెలిపారు. ఆయనొక లెజెండ్ అని, సొంత నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఆటగాళ్ల కెరీర్ విషయంలోనూ BCCI జోక్యం చేసుకోదని సైకియా తెలిపారు.


