News September 18, 2024
త్రివిక్రమ్‌పై పూనమ్ ఆరోపణలు.. స్పందించిన తమ్మారెడ్డి

డైరెక్టర్ త్రివిక్రమ్‌పై గతంలో ‘మా’కు ఫిర్యాదు చేశానని, ఆయనను ప్రశ్నించాలని హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన <<14124651>>ట్వీట్‌పై<<>> దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘ఆమెకు MAAకు ఏ సంవత్సరంలో, ఎందుకు ఫిర్యాదు చేసిందో తెలియదు. అప్పటికి కమిటీ ఏర్పాటై ఉంటే కంప్లైంట్ బాక్స్‌లో తన ఫిర్యాదు లెటర్ వేసి ఉంటే సరిపోయేది. ఇప్పటికైనా ఫిర్యాదు అందితే కచ్చితంగా చర్చిస్తాం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Similar News
News March 7, 2026
మూడుసార్లూ కివీస్‌దే పైచేయి.. ఈసారి చెక్ పడాల్సిందే!

T20WC: ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడేందుకు భారత్ ఇంకో గెలుపు దూరంలో ఉంది. అయితే ప్రత్యర్థి న్యూజిలాండ్‌తో T20WC చరిత్రలో భారత్‌కు పేలవ రికార్డ్స్ ఉండటం చర్చనీయాంశమైంది. భారత్ NZతో ఆడిన మూడు మ్యాచుల్లోనూ (2007, 2016, 2021) కివీస్‌దే విజయం. ఈసారి ఆ జట్టు ఓపెనింగ్, ఫీల్డింగ్, స్పిన్ బలంగా ఉందని.. సెమీస్ తరహాలోనే భారత్ రాణించి కప్పు కొట్టాలని, ఆ స్ట్రీక్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News March 7, 2026
బాబీ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్?

తాను త్వరలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి పనిచేయనున్నానని రైటర్ కోన వెంకట్ ప్రకటించారు. ఆ సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నట్లు చెప్పారు. అయితే, బాలీవుడ్ వర్గాలు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదంటున్నాయి. హృతిక్ ఓకే చెప్పలేదని.. కథ మాత్రమే విన్నారంటున్నాయి. ప్రస్తుతం ఆయన బిగ్ బడ్జెట్ మూవీ కోసం రెడీ అవుతున్నారని టాక్. అయితే ఆ మూవీయే కోన-బాబీ సినిమా అని మరికొంత మంది అంటున్నారు.
News March 7, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 7)

* 1921: తొలి తెలుగు సినీ నేపథ్య గాయకుడు ఎమ్.ఎస్ రామారావు జననం (ఫొటోలో)
* 1938: నోబెల్ గ్రహిత, జీవశాస్త్రవేత్త డేవిడ్ బాల్టిమోర్ జననం
* 1952: వెస్టిండీస్ క్రికెట్ మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ జననం
* 1955: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జననం
* 1952: ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద మరణం


